• HOME
  • భక్తి
  • ప్రేమ, విశ్వాసాల ప్రతీక క్రిస్మస్

  ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి.  మానవాళి పాపాలను మోసిన కరుణామయుడు… ప్రేమ, అహింసలతోనే ప్రపంచ మనుగడ సాధ్యమని చాటిన మహనీయుడు. ప్రపంచానికి శాంతి, అహింస, ప్రాణిప్రేమ, పరోపకారం, సోదరభావాలను సందేశంగా అందించిన యేసు ప్రభువు జన్మదినమే క్రిస్మస్‌.  దేవుని కుమారుడైన ఏసు పుట్టిన రోజును క్రైస్తవులు క్రిస్మస్ పేరిట జరుపుకొంటారు. ఏసు అంటే రక్షకుడు అని అర్థం. తన జీవిత కాలమంతా ప్రేమ, త్యాగం, శాంతి, విశ్వాసాలను జనులకు బోధించి వారిని మంచి మార్గాన నడిపేందుకు క్రీస్తు చేసిన  సేవలను ఈ వేడుకల్లో స్మరించుకొంటారు. దేవుని కుమారుడైన యేసు సమాజంలోని పతితులు, నిరుపేదలు, బలహీనుల పక్షాన  నిలిచి చేసిన త్యాగాలను ఈ క్రిస్మస్ ప్రార్ధనల సందర్భంగా క్రైస్తవులు కన్నీటితో స్మరించుకొంటారు.

లోక రక్షకుని పుట్టుక

వేల ఏళ్ల నాడు నాటి రోమన్ పాలకుడైన ఆగస్టస్ సీజర్ తన రాజ్యపు జనగణన చేపడతారు. ఈ క్రమంలో ప్రజలంతా డిసెంబరు 25 నాటికి సొంత ఊళ్లకు చేరి తమ కుటుంబ వివరాలు నమోదు చేయించుకోవాలని ఆదేశిస్తాడు. ఆ సమయంలోనే అక్కడి నజరేతు పట్టణ వాసి మేరీతో జోసెఫ్‌కు పెళ్లి కుదిరుతుంది. ఓ రోజు మేరీకి 'గాబ్రియేల్' అనే దేవదూత కనబడి ' దైవానుగ్రహం చేత నీవు కన్యగా గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తావనీ, దేవుని కుమారుడైన ఆ బిడ్డకు ఏసు అని పేరు పెట్టాల'ని సూచిస్తాడు. దైవదూత చెప్పినట్లుగానే  విధంగానే మేరీ గర్భం దాల్చగా, జోసెఫ్ ఆమెను వివాహం చేసుకోవటానికి నిరాకరిస్తాడు. అయితే ఒక రాత్రి ఆయనకు దేవదూత కలలో కనపడి ' దేవుని నిర్ణయం మేరకే మేరీ గర్భవతి అయిన సంగతి చెప్పి, ఆ బిడ్డ రానున్న రోజుల్లో ప్రజలను పాపాల నుంచి రక్షిస్తాడ'ని చెబుతాడు.దీంతో జోసెఫ్ మేరీని ప్రేమతో ఆదరిస్తాడు. రాజాజ్ఞ మేరకు వారు స్వగ్రామమైన బెత్లెహేమ్‌ చేరతారు. జనాభా లెక్కలకు తరలివచ్చిన జనం రద్దీకి తోడు జోసెఫ్ స్వగృహం శిధిలమై ఉండటంతో వారు ఓ పశువుల పాకలో బస చేయగా, మేరీ అక్కడే బాలునికి జన్మనిస్తుంది. అదే సమయాన ఊరికి దూరంగా ఉన్న గొర్రెల కాపరులకు దైవదూత కనిపించి పశువుల పాకలో  లోకరక్షకుడు జన్మించాడని కొన్ని ఆనవాళ్లు చెప్పగా  గొర్రెల కాపరులు సంతోషంతో బాలయేసుని దర్శిస్తారు. ఆ రోజు డిసెంబరు 24 గనుక నాటి నుంచి ఏటా ఆ మరునాడు డిసెంబర్ 25 ను క్రిస్మస్ పండుగగా జరుపుకోవటం మొదలైంది.

విశేషాలు

 క్రిస్మస్‌కు ముందు యునైటెడ్‌ క్రిస్మస్‌ పేరుతో నిర్వహించే వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. క్రిస్మస్‌ పండుగకు ముందు నుంచే క్రిస్మస్ తాత రాత్రివేళ ఇళ్లవెంట తిరిగి పిల్లలకు సంతోషం కలిగేలా పాటలు పాడుతూ, ఆడుతూ పిల్లలకు బహుమతులు పంచుతారు. ఇక.. పండుగ రోజున బెత్లెహాములో పశువుల పాకలో యేసు జన్మించైనా ఘట్టాన్ని గుర్తు చేసేలా క్రిస్మస్‌ రోజున చర్చిల్లో కర్రలు, గడ్డితో అందమైన పాకను నిర్మించి దానిని అలంకరిస్తారు. ముందు బాగంలో క్రీస్తు జననాన్నీ సూచించేలా నక్షత్రాన్ని వేలాడదీస్తారు.క్రిస్మస్‌ పర్వదినం రోజున క్రైస్తవులు తెల్లవారు జామునే స్నానాలు చేసి, కొత్త వస్త్రాలు ధరించి చర్చికి చేరి ప్రార్ధనలు చేస్తారు. క్రిస్మస్‌ నాడు జరిగే ప్రత్యేక ఆరాధనలలో పాలు పంచుకొంటారు. అనంతరం బంధు మిత్రుల ఇళ్ళకు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతారు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE