'నేను' అనే భావనను వదిలించుకోవటానికే మన పూర్వీకులు తీర్థయాత్రలు చేసేవారు. మనం దేన్నైతే గొప్పదని అనుకొంటున్నామో దానిని పూర్తిగా అనుభూతి చెంది, ఊహించనంతగా దానికి దగ్గరగావటమే యాత్ర ప్రధాన ఉద్దేశం. తీర్థయాత్రను ఒక యుద్ధంగా హడావుడిగా గాక సమర్పణా భావంతో చేసినప్పుడే దాని ఫలితాన్ని సంపూర్ణంగా మనం పొందగలము. అప్పుడే మన ఆధ్యాత్మిక మార్గానికి అడ్డంకిగా ఉన్న 'నేను' అనే భావనను తొలగించుకోగలము. దానివల్ల మనిషి తనకున్న అన్ని పరిమితులనూ, నిర్భంధతలనూ అధిగమించి హద్దులు లేని చేతనా స్థితికి చేరగలడు. తీర్థయాత్రలో భాగంగా దూరమార్గాల్లో ప్రయాణిస్తూ, పెద్ద పెద్ద పెద్ద పర్వతాలను అధిరోహిస్తూ, నదులను దాటుతూ మనిషి తనను తాను కఠిన ప్రక్రియలకు గురిచేసుకోవటం ద్వారా అంతిమంగా శూన్యంగా మారే ప్రక్రియే తీర్థయాత్ర.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE