• HOME
  • భక్తి
  • ధర్మమే సుగుణాభిరాముని మార్గం

    తన సుగుణాలతో, సుపరిపాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్న చక్రవర్తి శ్రీరాముడు. ఆ జగదభిరాముని జన్మదినమే శ్రీరామనవమి. ఈ రోజే శ్రీరామ చంద్రమూర్తి మిథిలా నగరంలో శివధనుర్భంగంచేసి పరమసాధ్వి అయిన సీతాదేవిని చేపట్టిన సంగతి తెలిసిందే. అందుకే చైత్రశుద్దనవమి మనందరికీ గొప్ప పండుగ రోజు. మహత్తర చరిత్ర గల ఈ ఇద్దరి కలయిక లోకానికి ఆనందదాయకమయ్యింది గనుకే సీతారాముల కళ్యాణం జగత్కల్యాణ కారకమయ్యింది. 

   రాముడు మర్యాదా పురుషోత్తముడు. సత్యవాక్య పరిపాలకుడు. పుట్టుక మొదలు అవతారాన్ని చాలించే వరకూ లోకానికి ఆదర్శప్రాయంగా నడచినవాడు. ధర్మ సంస్థాపన, జన రంజనకమైన పాలన కోసం అష్టకష్టాల పాలైన ధర్మమూర్తి. తండ్రి మాట కోసం రాజ్యాధికారాన్ని తృణప్రాయంగా వదిలేసి, నార వస్త్రాలు ధరించి అడవుల బాట పట్టిన నీతిమంతుడు. తల్లిదండ్రులపట్ల వినయ విధేయతలు, శీలసంపద, గొప్ప ఔదార్యం, పాలనా సామర్ధ్యాలు రాముని ప్రత్యేక గుణాలు. 

లోకకంటకులైన రాక్షసులు సాధుజీవనులైన మునులను, ఋషులను బాధించినప్పుడు తన శౌర్యపరాక్రమాలతో రాక్షసులను అంతమొందించిన గొప్ప వీరుడు. అధర్మంగా సీతమ్మను అపహరించిన రావణునిపై యుద్ధం ప్రకటించి, సకల వానర సహాయంతో లంకా నగరాన్ని జయించి, రావణుని వధించి ఆ రాజ్యాన్ని తిరిగి విభీషణుడికే అప్పగించిన రాజనీతిజ్ఞుడు. రాముని పరిపాలనలో ధర్మం నాలుగు పాదాలతో విలసిల్లింది. ఆయన పాలనలో నెలకు మూడు వానలు కురిసేవనీ, బంగారు పంటలు పండేవనీ, రామరాజ్యంలో దొంగలభయం లేదనీ, మోసం లేదనీ, ప్రజలంతా అన్నాదమ్ముల్లా బతికారనీ, అకాల మరణాలు లేవనీ రామాయణ మహాకావ్యం చెబుతోంది. 

'రామో విగ్రహవాన్‌ ధర్మః' అని రామాయణం చెబుతోంది. అంటే ధర్మాన్ని విగ్రహంగా పోతపోస్తే అది రాముడిని అర్థం. అసత్యాలు, అవినీతి, అరాచకం, బాధ్యతారాహిత్యం పెచ్చరిల్లిపోతున్న ఈ రోజుల్లో రాముని నడవడి మనకు మార్గదర్శనం చేస్తోంది. పెద్దల పట్ల పిన్నలు వ్యవహరించాల్సిన తీరునూ నేర్పిస్తోంది. ధర్మాన్ని పాటించని వారు ఎవరినైనా వదలకుండా శిక్షించాల్సిందేనని రాముని చరిత్ర బోధిస్తోంది. 

రాముని పాలన, జీవితం ఎప్పటికీ జగత్తుకు ఆచరణీయమే. అయన సచ్ఛీలం నీతి మరుస్తున్న నేటి తరాలకు రాచబాట!Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE