దీపం జ్ఞాన చిహ్నం. నిర్లక్ష్యమన్న చీకటిని పారదోలే దివ్యమైన జ్యోతి. ప్రతి ఇంట్లోనూ దేవుని ముందు ఉదయం, సాయం సంధ్య వేళల్లో రెండుసార్లూ దీపారాధన చేయడం మన ఆచారం. సభాసంప్రదాయాల్లో జ్యోతి ప్రజ్వలనంతో ఆరంభినటం మన సంప్రదాయం. కొన్ని ఆలయాల్లో, ఇళ్ళల్లో ఎప్పుడూ దీపం వెలుగుతూనే ఉంటుంది. దీనిని అఖండ దీపం అని అంటాము. దీప కాంతి చీకటిని పారదోలినట్లే, జ్ఞానం నిర్లక్ష్య ధోరణిని నిర్మూలి స్తుంది. దేవుని ముందు ఉన్న దీపం వెలుగులో ఎదురుగా ఉన్న దేవుడి పటాన్ని మాత్రమే కాకుండా హృదయంలోని అంతరాత్మను గుర్తించటమే. హృదయ దీపం అజ్ఞానపు చీకటిని పారదోలేసరికి ఆత్మజ్ఞానం ఆవిష్కారం అవుతుంది. అన్ని రూపాల్లోని సంపద అయిన జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం, అన్ని పవిత్ర సందర్భాలలోనూ మన ఆలోచనలకు, చర్యలకు సాక్ష్యంగా జ్యోతిని వెలిగిస్తాము.  సంప్రదాయబద్దంగా వెలిగించే నూనె దీపానికి ఆధ్యాత్మిక గుర్తింపు ఎక్కువుగా ఉంటుంది. దీపపు కుందిలో పోసే నెయ్యి లేదా నూనె, వత్తి మనలోని కోరికలు, అహంభావ ధోరణులకు సంకేతము. భగవంతుని ముందు దీపం వెలిగించగానే మనలోని కోరికలు నెమ్మదిగా ఆవిరవుతూ, అహం కాలిపోతూ వుంటుందని అర్థం చేసుకోవాలి.

దీపారాధన.. కొన్ని సూచనలు 

స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు.అగ్గిపుల్లతో గాక హారతి  లేదా అగరవత్తి తోనే దీపాన్ని వెలిగించాలి. ఒకవత్తితో దీపారాధన చేయరాదు. దీపారాధన మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి. శివుడికి ఎడమ వైపు, శ్రీ మహా విష్ణువుకు కుడివైపు దీపాన్ని ఉంచాలి.  అమ్మవారికి  నూనె దీపమైతే ఎడమపక్కగా, ఆవు నేతి దీపమైతే కుడి వైపు వెలిగించాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE