హిందువులు షోడశోపచార పూజా విధానంలో పూజిస్తారు. షోడశ అనగా 16. ఉపచారాలు అనగా సేవలు. ఉపచార విధానాలలో దేవుణ్ణి ఎలా పూజిస్తారో ఇంచుమించు అలాగే మన ఇంటికి వచ్చిన పెద్దలను, గురువులను సేవించి మర్యాద చేయాలని మన పెద్దల మాట. ఆ ఉపచారాలు ఏమిటో తెలుసుకొందాం.

 • ఆవాహనం            -     మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించాలి.
 • ఆసనం                -     వచ్చిన వారిని కూర్చోబెట్టాలి.
 • పాద్యం                -     పాద పూజ చేయాలి.
 • ఆర్ఘ్యం                 -     చేతులు శుభ్రపరచాలి.
 • ఆచమనీయం        -     తాగేందుకు నీళ్ళివ్వటం
 • స్నానం                -    శుభ్రమైన నీటితో అభిషేకము
 • వస్త్రం                 -     పొడి బట్టలు కట్టటం
 • యజ్ఞోపవీతం        -     నూతన యజ్ఞోపవీతమును వేయటం
 • గంధం                -     సానమీద గంధపు చెక్క సాదగా వచ్చే గంధమును అలంకరించుట
 • పుష్పం               -      పువ్వులతో అలంకరించాలి.
 • ధూపం               -      అగరుబత్తీలు వెలిగించి ఉంచాలి.
 • దీపం                 -      ఆవు నెయ్యి లేదా మంచి నూనెతో దీపము వెలిగించాలి.
 • నైవేద్యం             -     శ్రద్ధగా వండిన ఆహారము లేదా ఫలములు, బెల్లము వంటివి సమర్పించాలి.
 • తాంబూలం          -     తమలపాకులు వక్కలు ఉంచాలి.
 • నమస్కారం         -      మనస్పూర్తిగా నమస్కరించాలి.
 • ప్రదక్షిణం           -       కుడి భుజము వైపున దేవుడు ఉండేలా దేవుని చుట్టూ తిరగటము.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE