తన అందం, అభినయంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి కత్రినా కైఫ్. మూడుపదుల వయసు దాటినా ఈ తరం నటులతో పోటీపడుతున్న అతిలోక సుందరి. సినిమాలతో బాటు పలు సంస్థలకు ప్రచార కర్తగా దూసుకెళ్తున్న కత్రినా తన అందం , ఆరోగ్యం విషయంలో పాటించే నియమాలేమిటో తెలుసుకుందాం. 

 డైట్‌ప్లాన్

ఆహరం విషయంలో కత్రినా చాలా క్రమశిక్షణను పాటిస్తుంది. ఏడాది పొడవునా కాస్త అటుఇటుగా ఇదే డైట్ ప్లాన్ ఫాలో అవుతుంది. 

 • ఉదయం నిద్ర లేవగానే 4 గ్లాసుల మంచి నీళ్లు
 • అల్పాహారంగా తృణధాన్యాలు, ఓట్స్‌ తో తయారు చేసిన వంటకాలు
 • మధ్యాహ్న భోజనంలో తక్కువ నూనెతో ఆవిరి మీద వేయించిన చేప, వెన్న రాసిన బ్రౌన్‌బ్రెడ్‌
 • సాయంత్రం చిరుతిండిగా బ్రౌన్‌ బ్రెడ్‌, పీనట్‌ బటర్‌
 • రాత్రి భోజనంలో ఒక కప్పు సూప్‌, చపాతి, చేపలు, కూరగాయల వేపుడు
 • రోజులో రెండు గంటలకోమారు ఉడికించిన కూరగాయ ముక్కలు, పండ్లు
 • శీతల పానీయాలకు పూర్తిగా దూరం.
 • పీచు అధికంగా ఆహారానికి ప్రాధాన్యం 

వర్కవుట్ ప్లాన్ 

కత్రినా దినచర్యలో వ్యాయాయం ఒక భాగంగా ఉంటుంది. ఏడాదిలో ఒక్కరోజు కూడా వర్కవుట్ మిస్ కాదు. ఇందుకోసం పూర్తి సమయం సేవలందించే యాస్మిన్ అనే ట్రైనర్ ని నియమించుకొంది.

 • రోజు వారీ వ్యాయామాల్లో ఏరోబిక్స్‌, జాగింగ్ తప్పనిసరి. 
 • ఆ తర్వాత జిమ్‌లో ప్రధాన వ్యాయామాలు సాధన చేస్తుంది.
 • కత్రినాకు స్విమ్మింగ్‌ అంటే ప్రాణం.
 • రోజూ అరగంటపాటు యోగా చేయటం ద్వారా ఒత్తిళ్లను అధిగమిస్తుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE