'ఒకరోజు రొమ్ము పరీక్షించుకొంటుంటే చిన్న తేడా ఉన్నట్లుగా అనుమానం వచ్చింది. లక్కీగా అమ్మానాన్నా ఇద్దరూ వైద్యులే కావటంతో నాకు ఆరోగ్యపరమైన అంశాల్లో చిన్నప్పటి నుంచే మంచి అవగాహన ఉంది. డాక్టర్‌ని కలిసి పరీక్ష చేయిస్తే అది బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది . అప్పటికి నా వయసు కేవలం 35 ఏళ్ళు మాత్రమే. సమస్య పట్ల అవగాహన ఉన్నా దాన్నిఎదుర్కొనే వయసు కాదు. గతంలో ఎవరినీ ఆ సమస్యతో చూసిన అనుభవమూ లేదు. ఒక్కసారిగా భయం, నిరాశ. ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావటం కొన్ని రోజులు కష్టమే అయింది. సమస్య గురించి భయపడితే ఉపయోగం లేదని తెలుసుకొని దాన్ని మొండిగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నా.సినిమాల్లో పోషించిన సాహసోపేతమైన పాత్రల ప్రభావం కూడా ఇందుకు ఉపయోగపడింది. 

చికిత్సలో భాగంగా రొమ్ము తీసినా పర్వాలేదనుకున్నా. చికిత్స మొదలైన తర్వాత జుత్తు ఊడిపోతున్నా కంగారుపడలేదు. క్యాన్సర్ మహమ్మారిని జయించే క్రమంలో కొన్ని కోల్పోక తప్పదని సర్దిచెప్పుకున్నా. అయినా మనసులో ఏదో ఒక మూల తెలియని భయం, దిగులు ఉండేవి. అయితే చికిత్స మొదలైన కొద్దీ రోజుల్లోనే నా భయం అర్థంలేనిదని తెలుసుకున్నా.చికిత్స పూర్తైన కొద్దీ రోజుల్లోనే సాధారణ జీవితంలోకి వచ్చా. ఈ ప్రయత్నంలో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇచ్చిన ధైర్యం మరువలేనిది. అవగాహన, ఆత్మస్థైర్యంతో బాటుఇప్పుడున్న ఆధునిక వైద్యం సాయంతో క్యాన్సర్ ను పూర్తిగా ఓడించవచ్చని నమ్మకంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా.' 

' క్యాన్సర్ అనగానే చావే అనుకునే రోజులు పోయాయి. ఏదో జరగరానిది జరిగిందని అనుకుంటూ మంచానికే పరిమితం కావద్దు. ఓపిక ఉన్నంతవరకూ మీ పనులు చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలకు కుటుంబ సభ్యులు, బాధ్యతల మీద ఉండే శ్రద్ధ తమ ఆరోగ్యం మీద కూడా చూపాల్సిన అవసరం ఉందని తెలుసుకోవాలి. అప్పుడే ఒకవేళ క్యాన్సర్ ఉన్నా త్వరగా గుర్తించి చికిత్స చేయటం సాధ్యం అవుతుంది. ముప్పై ఏళ్లు వచ్చాయంటే తప్పనిసరిగా ‘మామోగ్రఫీ’ చేయించుకోవాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు.'

                                                                                                          - గౌతమి, సినీ నటిRecent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE