తెలుగు తెరపై తానేమిటో తొలిచిత్రంతోనే నిరూపించుకున్న నటుడు రామ్ చరణ్ . చిరు తనయుడిగా రంగ ప్రవేశం చేసినా  వైవిధ్య భరితమైన పాత్రలను  ఎంచుకుంటూ  తనదైన శైలిలో ముందుకు సాగుతున్న సృజనశీలి. కెరీర్ తో బాటు కుటుంబం, వ్యక్తిగత జీవితానికీ తగినంత సమయం కేటాయిస్తే  చక్కని  ఆరోగ్యం, ఆనందం సొంతమవుతాయ  నీ, ఫిట్ నెస్ పెంచుకునేందుకు అందరూ తమ వంతుగా కృషి చేయాలంటున్న మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ తేజ్ బీపాజిటివ్ తో పంచుకుంటున్న ముచ్చట్లు ....

స్కూల్, కాలేజీ  ముచ్చట్లు

ఊటీలో చదివాను. బాస్కెట్ బాల్, వాలీబాల్ అంటే చాలా ఇష్టం. ఈ రెండు జట్లకీ నేనే కెప్టన్. హార్స్ రైడింగ్ కూడా అప్పుడే నేర్చుకున్నాను . రన్నింగ్, ట్రాకింగ్ కూడా రోజూ చేసేవాళ్ళం. కాలేజీ రోజులనాటికి చదువుతో బాటు నటన మీద దృష్టి పెట్టా.  రొజూ జిమ్ చేయటం , బాడ్మింటన్ ఆడటం చేసేవాడిని.

అమ్మానాన్నల గురించి?

నాన్న సినిమాలతో బిజీగా ఉండటం వల్ల అమ్మే అన్నీ చూసుకుంది . దీంతో మొదటినుంచి అమ్మ అంటే చనువు ఎక్కువ. చదువు, క్రమశిక్షణ వంటి విషయాలలో మాత్రం ఎలాంటి మినహాయింపులు లేవు .  నాన్న తక్కువ మాట్లాడినా అన్ని విషయాలలో నాకు స్వేచ్ఛ ఇచ్చారు.

ఫిట్ నెస్

రోజూ  జిమ్ చెస్తాను. కార్డియో, స్ప్రిన్ట్స్ ఎక్కువగా చెస్తున్తా. వారంలో ఒకటి, రెండు రోజులు 15 కిలోమీటర్ల దూరం సైక్లింగ్ చెస్తాను. ఫిట్ నెస్ అంటే కేవలం బాడీ పెంచటం మాత్రమె కాదని  తెలుసుకోవటం అవసరం . ఇప్పటి రోజుల్లో అనేక రకాల వర్కౌట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. బాడీ బిల్డింగ్ కోసం మూడు రోజులు కేటాయించి మిగిలిన రోజుల్లో వాకింగ్, రన్నింగ్, ఫుట్ బాల్ వంటి ఆటలు ఆడితే ఫిట్ నెస్ దానంతట అదే వస్తుంది. ఆఫీసు సమయాల వాళ్ళ వ్యాయామం చేసే సమయం లేని వాళ్ళు మెట్లు ఎక్కి దిగటం, కిలోమీటర్ దూరం లోపు దూరాలు నడుచుకుంటూ వెళ్ళటం చెయొచ్చు.

ఆహారం

ఇంట్లో చేసే ఆహారానికి మించింది మరొకటి లెదు. మా తోటలో కాసిన కూరగాయలే  ఎక్కువగా వాడుతాము.  ఎక్కువగా శాకాహారామంటేనే ఇష్టం.  చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు. బ్రేక్ ఫాస్ట్ అసలు మిస్ కాను. భోజనం, స్నాక్స్ కూడా ఇంటినుంచే వస్తాయి.

ఆరోగ్యం విషయంలో పాఠకులకు మీ సలహా..

ఇష్టమైనవి తింటూనే అందుకు తగినంత వ్యాయం చేయటం, మనసును ప్రశాంతంగా వుంచుకోవటం మీద దృష్టి పెడితే చక్కని ఆరోగ్యం సొంతమైనట్లే  

 

ఇష్టాయిష్టాలు

హాబీలు- గుర్రపు స్వారీ

ఇష్ట మయిన హాలిడే స్పాట్ - ఏదయినా హిల్ స్టేషన్

ఇష్ట మయిన దర్శకుడు - క్లింట్ ఈస్ట్ వుడ్

ఫేవరేట్ సినిమా - గ్లాడియే టార్, టెర్మినేటర్

ఎదుటి వాళ్ళలో మీకు నచ్చనిది - డబుల్ స్టాండర్డ్స్

 

నచ్చేది - నిజాయితీ

అత్యంత సంతోషకరమైన సందర్భం- చిరుత సినిమాను తాతయ్యతో కలిసి చూడటంRecent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE