'దేశముదురు’ సినిమాతో సౌత్ కి పరిచయం అయిన ఉత్తరాది ముద్దుగుమ్మ హన్సిక. మెరిసే అందం, చెదరని చిరునవ్వుతో ప్రేక్షకుల మనస్సులో ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన నటి. గతంలో తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న హన్సిక ప్రస్తుతం వరుస తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. అందం, ఆరోగ్యం, సినిమాల గురించి హన్సిక చెబుతున్న కొన్ని ముచ్చట్లు.. 

తెలుగు సినిమాలకి గ్యాప్ ఇచ్చారు ఎందుకలా?

 తెలుగులో మంచి కథ గురించి ఎదురు చూసిన సమయంలో తమిళంలో నచ్చిన స్క్రిప్ట్స్ వచ్చాయి. దీంతో అక్కడ బిజీ అయ్యాను. ఆ టైంలో తెలుగులో ఆఫర్లు వచ్చినా డేట్స్ అడ్జస్ట్ కాలేదు. మంచి కథ, డేట్స్ కుదిరితే కచ్చితంగా మళ్ళీ తెలుగులో చేస్తాను. 

గతంలో కంటే బరువు తగ్గినట్లున్నారు?

అవును. స్క్వాష్ ఆడడం, యోగా సాయంతో బరువు తగ్గాను. 

మీ మెరిసే చర్మ రహస్యం..?  

ఒక సినిమానటిగా చర్మ సంరక్షణ మీద ద్రుష్టి పెట్టాల్సిందే. అయితే అదే పనిగా క్రీములు గట్రా వాడను. షూటింగ్   ఉంటే తప్ప మేకప్ జోలికిపోను. పార్టీకో, ఈవెంట్ కో వెళ్ళాల్సి వస్తే కొద్దిగా లిప్ స్టిక్ తప్ప అతిగా మేకప్ వేసుకోను. 

శిరోజాల సంరక్షణ కోసం పాటించే చిట్కాలు ?  

కాలుష్యం, షూటింగ్ మూలంగా జుట్టు దెబ్బ తినటం సహజమే. అందుకే రోజూ   కొంత సమయం శిరోజాల కోసం కేటాయిస్తా. మా అమ్మ హెయిర్ స్పెషలిస్ట్. తను ఇంట్లో చేసిన ఉసిరిపొడి, బొప్పాయి పొడి వంటివి జుట్టుకు పట్టించి స్నానం చేస్తా. 

మీరు ఇష్టంగా వాడే బ్రాండ్స్?  

ఎప్పుడూ ప్రశాంతంగా , ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నిస్తా.   నా హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడూ జాన్సన్స్ బేబీ లోషన్ ఉంటుంది. అదే నా మాయిశ్చరైజర్. నా ఇష్టమైన 3 ఫెర్ ఫ్యూమ్ బ్రాండ్స్ ఎస్టీలాడర్, నినారిస్పి, ఛానల్ ఎక్కడికెళ్లినా వెంట తీసుకెళతా.  

మీ ఆహారం నియమాలు

ఏది తిన్నా వేళ పట్టున తినటం అలవాటు. ఎట్టి పరిస్థితిలోనూ   టైమ్ మిస్ కాను. మధ్యమధ్యలో పండ్లు, గ్రీన్ సలాడ్స్ ఎక్కువగా తీసుకొంటాను. త్వరగా నిద్ర పోయి, పెందలాడే లేవటం అలవాటు. 

మీ చెదరని చిరునవ్వు గురించి ?

ఈ ప్రపంచంలో ఏ మనిషికీ జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎవరికి తగ్గ కష్టాలు వారికున్నాయి. అయితే చిరునవ్వుతో వాటిని జయించొచ్చు.   నా దృష్టిలో చిరునవ్వు ఓ గొప్ప ఔషధం. 

మీ హాబీస్ ?

చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. షూటింగ్ లేనప్పుడు పెయింటింగ్ మీదే కూర్చోంటా. నా వంతు బాధ్యతగా కొందరు చిన్నారులను దత్తత తీసుకున్నాను. వారికోసం రెండేళ్లలో ముంబైలో పూర్తిస్థాయి భవనం నిర్మించే పనిలో ఉన్నా. ల్యాండ్ కూడా కొనుగోలు చేసాము. నా పెయింటింగ్స్ కొన్నింటిని వేలం చేసి ఆ పిల్లల కోసం ఒక సంరక్షణ నిధిని ఏర్పాటు చేస్తున్నాను. 

యువతకు మీరిచ్చే సలహా?

ఉన్నది ఒక్కటే జీవితం గనుక దాన్ని వీలైనంత ప్రేమిద్దాం. ఆస్వాదిద్దాం. నచ్చినట్టు ఉండేందుకు ప్రయత్నిద్దాం.   అనవసరమైన విషయాలను మన జీవితంలోకి రానివ్వకుండా చూసుకొందాం.   సమస్యల్ని అతిగా ఊహించుకొని భయపడాల్సిన పనిలేదు. ఎప్పుడూ మన చిరునవ్వును నిలుపుకోగలిగితే మన జీవితం, మొత్తం ప్రపంచం మరింత అందంగా మారతాయి.    Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE