పాత రోజుల్లో సన్నగా ఉన్నవారిని బాగా తినాలని  పెద్దలు చెబుతుండేవారు. అదే ఇప్పుడైతే  కాస్త బొద్దుగా కనిపిస్తే చాలు పెద్దలే డైటింగ్ చేయమని చెబుతున్నారు. ప్రచార సాధనాల వల్ల ఇటీవలికాలంలో సైజ్  జీరో గురించి కూడా చర్చ బాగా జరుగుతోంది. చదువుకునే వారు, నిపుణుల మొదలు సామాన్యుల వరకు వీలున్నత మేర సన్నగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. అలాగే సన్నబడే ప్రయత్నంలో అనారోగ్యకర ఆహార, వ్యాయామ నియమాలను పాటించి లేని పోని సమస్యలనూ కొని తెచ్చుకుంటున్నారు. అందుకే సన్నబడాలనుకునే వారు నచ్చింది తినటం మానుకోకుండానే నాజూగ్గా ఉండేందుకు దోహదపడే కొన్ని అంశాల మీద దృష్టి పెట్టాలి. 

ఆహారపరమైనవి

 • చాలా మంది పొరబాటు పడుతున్నట్లు ఆహారానికి తగిన వ్యాయామం చేయాల్సిన పని లేదు . శరీర పరిస్థితి, స్వభావం, బరువు తదితర అంశాల ప్రాతిపదికన కనీస స్థాయిలో వ్యాయామాలు చేస్తూ పోవాలి.
 • ఒకేసారి సన్నబడాలని ఏమీ తినకుండా పొట్టను ఖాళీగా ఉంచితే గ్యాస్ ఏర్పడే ఇబ్బంది ఉన్నందున  ప్రతి మూడు,నాలుగు  గంటలకు  కొంచం కొంచం ఆహారం తప్పక తీసుకోవాలి.
 • తీసుకునే ఆహారంలో గింజలు, పప్పు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలి. వాటిని ఎప్పుడు ఎలా తినాలనే ప్రణాళిక ఉండాలి.
 • ఎక్కువ సేపు శక్తిని నిలిపే ప్రోటీన్స్, పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం మరచి పోవద్దు.
 • చక్కెర తక్కువ ఉన్న పదార్ధాలు తీసుకోవాలి. చక్కెరకు బదులుగా బెల్లం, తేనె, ఖర్జూరాలు, పటిక బెల్లం వంటివి వాడాలి.     
 • ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు ఒక్కో పండు చొప్పున తీసుకుంటే పోషకాలతో బాటు పీచు కూడా లభిస్తుంది.
 • రోజుకి 10- 12 గ్లాసుల నీరు తాగాలి. 60 నుంచి 70 శాతం ఆహారం, మిగిలిన 30 నుంచి 40 శాతం నీటిని తీసుకోవాలి.
 • పిజ్జా, బర్గర్స్ స్థానంలో గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవాలి.
 • మూడు నాలుగు వారాలకొకసారి మాత్రమే డైట్ ప్లాన్‌ను మార్చాలి. తరచూ మార్చడం వలన జీవప్రక్రియ దెబ్బతినే ప్రమాదముంది.
 • వ్యాయామాంశాలు
  • తెల్లవారుజామున కనీసం గంట పాటు చేసే వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల శరీరం అంతా బాగా కదలి అన్ని అవయవాలూ చురుగ్గా పనిచేయటం మొదలవుతుంది. ఉదయం వీలు కాకపొతే సాయంత్రం అయినా పర్వాలేదు.
  • ఎప్పుడూ ఒకేరకమైన వ్యాయామాలు కాకుండా శరీర అవసరాలకు తగిన వ్యాయామాలు చేయాలి.
  • తక్కువ తీవ్రత ఉన్న వ్యాయామాలతో మొదలుపెట్టి క్రమంగా తీవ్రత పెచుతో పోవటం మరువొద్దు.
  • ఒకరోజు వ్యాయామం చేసి రెండు రోజులు మానుకోవటం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోగా లేనిపోని ఇబ్బందులు వస్తాయి.
  • ఒక్కరే వ్యాయామం చేసే బదులు బృందంగా చేస్తే మరింత ఉల్లాసంగా ఉంటుంది.
  • యోగ, ప్రాణాయామం వంటి సాధనలు సైతం సన్నబడటానికి సాయపడతాయి

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE