గత దశాబ్ద కాలంగా మన జీవన  శైలిలో అనేక రకాల మార్పులు చోటు చేసుకున్నాయి. పెరిగిన  జీవన వేగంతో బాటు కాలుష్యంతో బాటు లెక్కకు మించిన  అంతుబట్టని అనారోగ్యాలతో సగటు మనిషి సతమతమవుతున్నాడు. ఆదాయాలు పెరిగినంతగా మనిషి జీవన ప్రమాణాలు పెరగటం లేదు. లెక్కకు మించిన వైద్య విధానాలు ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ ఫలితాలు కనిపించటం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్ది మనందరి ఆరోగ్యాన్ని కాపాడటంలో భారతీయ సంప్రదాయ యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యోగా ప్రాధాన్యతను గుర్తించిన ప్రపంచం ఇప్పుడు దానిపై ప్రత్యెక శ్రద్ధ కనబరచటం తెలిసిందే. 

మన పూర్వీకులు అందించిన అపూర్వ ఆరోగ్య విజ్ఞానమే యోగా. యోగ సాధనకు పైసా ఖర్చు ఉండదు. మంచి గాలి, వెలుతురూ ఉన్న గది లేక ప్రశాంతమైన ప్రదేశం,  కాస్త సౌకర్యంగా ఉండే దుస్తులు, కింద వేసుకునే ఒక మందమైన చాప ఉంటే ఎక్కడైనా , ఎప్పుడైనా యోగా సాధన చేసుకోవచ్చు. మూడేళ్ళ చిన్నారి నుంచి తొంభై ఏళ్ళ బామ్మ వరకూ అందరూ యోగా చేయ వచ్చు. అయితే కొన్ని అనారోగ్య సమస్యలున్న వారు నిపుణులు సూచించిన విధంగా యోగా చేయాల్సి ఉంటుంది. పని ఒత్తిళ్ళ నుంచి శరీరానికి, మనసుకూ పునరుత్తేజాన్నికలిగించే మరీచ్యాసనం గురించి తెలుసుకొని రోజూ సాధన  చేద్దాం.

మరీచ్యాసనం

ఉపయోగాలు: మరీచి మహర్షి పేరుతో ప్రాచుర్యంలో ఉన్న ఈ ఆసనం మల బద్ధకం, పలు రకాల జీర్ణ సమస్యలు, ఆస్థమా, వెన్నుపూస దిగువ భాగాన నొప్పి, తీవ్రమైన అలసట వంటి సమస్యలకు మంచి విరుగుడు. మహిళల్లో కనిపించే నెలసరి సమస్యలను ఇది దూరం చేస్తుంది.

చేసే పద్దతి:

  • ముందుగా రెండు కాళ్ళు చాచి వెన్నుపూస నిటారుగా ఉంచి కూర్చోవాలి.(దండాసనం)
  • ఎడమ కాలును అలాగే ఉంచి, కుడి కాలిని నెమ్మదిగా మడిచి అరికాలు నెలకు ఆన్చి, మోకాలు భుజానికి ఆనేలా పెట్టుకోవాలి.
  • సపోర్టు కోసం ఎడమ చేతిని కాస్త వెనక్కు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు శ్వాస వదిలి, వీలైనంత మేరకు ఎడమ వైపు తిరిగి, కుడి మోచేతిని కుడి మోకాలిని చుడుతూ  దాన్ని ఎడమ చేతితో పట్టుకోవాలి.
  • ఈ భంగిమలో అయిదు సార్లు సుదీర్ఘంగా శ్వాస తీసుకొని నెమ్మదిగా వదలాలి.
  • ఇప్పుడు తిరిగి నెమ్మదిగా దండాసనం లోకి మారాలి.
  • ఈ సారి కుడి కాలు చాచి ఎడమకాలును మడుస్తూ ఇదే విధంగా సాధన చేయాలి.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE