ఉపయోగాలు: ఉదర సంబంధిత సకల సమస్యలకు ఇది చక్కని పరిష్కారం. దీనితో బాటు మానసిక ప్రశాంతతను, ఊపిరితిత్తుల పనితీరును గణనీయంగా మెరుగుపరస్తుంది. తల, ఊపిరితిత్తులు, ఉదరం, పక్కటెముకలు, ముక్కు, గొంతు భాగాలన్నీ ఉత్తేజితమయ్యేలా చేయటం దీని ప్రత్యేకత.
చేసే పద్దతి
- పద్మాసనం, వజ్రాసనంలో కూర్చోవాలి. అలా కూర్చోలేని వారు సుఖాసనంలో కూర్చోవచ్చు.
- వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి.
- అరచేతులను మోకాళ్ళ మీద పెట్టటం లేదా చిన్ముద్ర (బొటన, చూపుడు వేళ్ళను కలిపి)లో పైకి చూసేలా పెట్టాలి.
- ఇప్పుడు బలంగా ముక్కుతో శ్వాసను బయటకు వదలటం, అంటే వేగంగా గాలిని పీల్చుకోవటం చేయాలి.
- బలంగా గాలిని బయటకు పంపిన ప్రతిసారీ అంతే వేగంగా శ్వాస తీసుకోవాలి.
- శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట వీపును తాకినట్లుగా ఉండేలా ప్రయత్నించాలి.
- ఒక్కో సెట్ లో 20 సార్లు ఉఛ్వాస, నిశ్వాసలు తీయాలి. రోజూ సాధన చేస్తూ ఒక్కో సెట్ కు 100 ఉఛ్వాస, నిశ్వాసల వరకు పెంచుకోవాలి.