రోజూ కాసేపైనా వ్యాయామం చేస్తే చక్కని ఆరోగ్యం చేకూరుతుందని మనందరికీ తెలుసు. మరి ఈ రోజువారీ వ్యాయామం ముఖానికీ తగిన ఆరోగ్యాన్ని అందిస్తుందా? అంటే వెంటనే చెప్పలేము. చాలామంది కొద్దిపాటి మేకప్ ఉంటే ముఖానికి అంతకంటే ఏమీ అవసరం లేదని అనుకుంటారు గానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం మాత్రం ముఖానికి  ప్రత్యేకమైన వ్యాయామం ఎంతో అవసరం. రోజూ పావుగంట పాటు చేసే ఫేషియల్‌ ఎక్స్‌ర్‌సైజ్‌ మూలంగా ముఖ చర్మం, కండరాలు ఒత్తిడి నుంచి విముక్తమై ముఖం తాజాగా, నిత్య యవ్వనంగా కనిపిస్తుంది. అలాంటి కొన్నిముఖ వ్యాయామాల వివరాలను తెలుసుకుందాం. 

కళ్ళ వ్యాయామం

పార్కు లేదా ఏదైనా ప్రశాంతమైన ప్రదేశంలో  సౌకర్యంగా,  సుఖాసనం వేసుకొని కూర్చోండి. వెన్నుపూసను నిటారుగా పెట్టి కళ్ళు మూయండి. ఇప్పుడు కళ్ళు తెరచి తల కదలనీయకుండా  వీలున్నంత కిందికి, ఆ తర్వాత గరిష్టంగా ఎంత పైకి చూడగలిగితే ఆ మేరకు చూడాలి. కళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా నెమ్మదిగా ఈ వ్యాయామాన్ని సాధన  చేయాలి. దీనివల్ల కణతలు,  కంటి మీద పడిన ఒత్తిడి తొలగి పోవటమే  గాక కంటి చూపు మెరుగు పడుతుంది. తర్వాత కళ్ళను సవ్య, అపసవ్య దిశల్లో 360 డిగ్రీల కోణంలో గుండ్రంగా తిప్పాలి. ఇలా పడేసి సార్లు చేస్తే కంటి మీది ఒత్తిడి దూరమవుతుంది.

నుదుటి వ్యాయామం

సుఖాసనం వేసుకొని వెన్నుపూస  నిటారుగా పెట్టి కూర్చోవాలి. రెండు కనుబొమ్మలను వీలున్నంత దగ్గరగా తీసుకువచ్చి వీలున్నంత మేర పైకి కదిలించాలి. 10 అంకెలు లెక్క పెట్టి తర్వాత ఇదే విధంగా కిందికి (ముక్కు వైపు) కదిలించాలి. ఇలా కొంచెం విరామంతో  5 సార్లు చేయాలి. మంచం మీద వెల్లికలా పడుకొని పై కప్పును చూస్తూ కనుబొమ్మలను పైకి ఎత్తటం, దించటం చేయాలి. ఇలా 10 సార్లు చొప్పున చేస్తే నుదుటి కండరాలు, నాడులు చురుగ్గా పనిచేస్తాయి. మాడు మొదలు నుదురు వరకు ఉన్న భాగమంతా ఒత్తిడి నుంచి బయట పడుతుంది.

చెక్కిళ్ళ వ్యాయామం (బుగ్గలు)

సుఖాసనం లో  ప్రశాంతంగా కూర్చుని పెదవులను బిగబట్టి ముందుకు, ఎడమవైపు కదిలిస్తూ కిందికి, అటునుంచి కుడివైపుకు తిప్పాలి. ఇలా ఒక్కో భంగిమలో 10 సెకన్ల పాటు ఉంచుతూ  10 సార్లు చేయాలి. అద్దం ముందు నిలబడి, రెండు పెదవులు బిగించి వీలున్నంత మేర నవ్వేందుకు ప్రయత్నించటం, ముక్కును  పైకీ, కిందికీ కదిలించటం వంటివి కూడా చెక్కిళ్ళ వ్యాయామంలో భాగమే.

పెదవుల వ్యాయామం

రెండు పెదవులనూ దగ్గరకు చేర్చి గుండ్రంగా పెట్టి బిగించి 5 సెకన్లు ఉంచి రిలాక్స్‌ అయిన తర్వాత మళ్ళీ మరోమారు ఇలాగే చేయాలి. రోజుకు ఇలా ఐదు సార్లు సాధన చేయాలి. పెదవులను బిగించి దంతాల మధ్య పెట్టి ఒత్తిడి కలిగించి 10 సెకన్ల తర్వాత తిరిగి పూర్వ స్థితికి తీసుకు రావటం ద్వారా కూడా పెదవులకు తగినంత వ్యయం అందించినట్లే.

ఈ ముఖ వ్యాయామాలను రోజూ ఉదయాన్నే సాధన  చేయాలి. వారమంతా చేయగలిగితే మంచి ఫలితం ఉంటుంది. వీలు కాని వారు వారంలో కనీసం 4 రోజులైనా చేయాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE