శారీక దృఢత్వానికి వ్యాయామం ఎంతగా  దోహద పడుతుందో సాహసక్రీడలూ అంతే  ఉపయోగపడతాయి. ఫిట్ నెస్ తో బాటు ఆత్మవిశ్వాసాన్ని, నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యాన్ని, పరిస్థితులను చక్కగా అంచనా వేసే నైపుణ్యాన్ని ఇవి పెంపొందిస్తాయి. సాహస క్రీడల పట్ల ఆసక్తి తో బాటు సంబంధిత క్రీడ పట్ల అవగాహన, తగినంత శారీరక సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలి. ప్రసార మాధ్యమాల ప్రచారం కారణంగా ఇటీవలి కాలంలో బంగీ జంప్, పారా గైడింగ్, ట్రెక్కింగ్, సర్ఫింగ్, డైవింగ్ వంటి సాహస క్రీడల పట్ల మనదేశంలో ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు అవసరమైన శిక్షణ అందించే నిపుణుల సంఖ్యా పెరుగుతోంది. వివరాల్లోకి వెళితే..

  • కొత్తగా సాహస క్రీడల గురించి ఆలోచిస్తున్న వారికి హైకింగ్ చక్కని ప్రత్యామ్నాయం. అంటే కొండలు, గుట్టలు, అడవులూ, మైదానాలలోని విభిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిరంతరాయంగా నడుస్తూ ముందుకు సాగిపోవటం. పదిమంది లోపు ఒక బృందంగా ఏర్పడి సాధన చేస్తే వ్యాయాయం గానే గాక మానసిక ఒత్తిడినీ దూరం చేస్తుంది. కొత్త ప్రాంతం, సరికొత్త అనుభవాలు ఎన్నో కొత్త విషయాలను నేర్పుతాయి కూడా.
  • సైకిల్ మీద కొండలు, గుట్టల్లోని ఎత్తు పల్లాలను దాటుకుంటూ నేర్పుగా కిందికి చేరుకోవటమే మౌంటెన్‌ బెకింగ్‌. చూసేందుకు తమాషాగా ఉన్నా ఇందుకు తగినంత నైపుణ్యం, కావాలి.
  • చిన్న చెక్క మీద శరీర భారాన్ని నిలుపుతూ ఒడుపుగా సముద్రంలో వచ్చే రాకాసి అలలను అధిగమించి ముందుకు సాగటమే సర్ఫింగ్‌. దీనికి ఈత, శరీరాన్ని కోరిన రీతిలో వంచటం వంటి నైపుణ్యాలు అవసరం. 
  • ఎత్తు అంటే భయం పోగొట్టుకోవాలనే వారికి పారాసైలింగ్ ఉత్తమ ప్రత్యామ్నాయం. అంటే ఎత్తైన ప్రాంతం నుంచి బెలూన్ సాయంతం గాలి వాటాన్ని బట్టి ప్రయాణిస్తూ సురక్షితంగా దిగటం అన్నమాట. అర్థ చంద్రాకారపు బెలూన్ సాయంతో చేసే పారా గ్లైడింగ్ కూడా ఈ కోవలోదే. గుండెనిబ్బరం, పరిస్థితిని బట్టి స్పందిచే స్వభావం ఉన్నవారు దీనిని చక్కగా ఆస్వాదించగలరు.
  • విదేశాల్లో ప్రాచుర్యం పొందిన మరో క్రీడ బంగీ జంపింగ్‌. నడుముకు తాడు కట్టుకొని ఎత్తైన కొండ ప్రాంతం నుంచి తలకిందులుగా దూకటమే బంగీ జంప్. దీనికి తగినంత గుండె ధైర్యం కావాల్సిందే . విదేశాల్లోనే దీనికి తగిన అనువైన ప్రదేశాలున్నాయి.
  • సముద్రపు అడుగున ఈదుతూ జలధి గర్భంలోని సరికొత్త లోకాన్ని, అక్కడి అందాలను ఆస్వాదించటమే స్కూబా డైవింగ్. గోవా, అండమాన్ వంటి ఎన్నో సముద్రతీర ప్రాంతాల్లో ఇది అందుబాటులో ఉంది.
  • వేగంగా ప్రవహించే నదిలో చిన్న బోటులో మీరే స్వయంగా తెడ్డుతో నడుపుకుంటూ, ప్రవాహ వేగం, దిశలను బట్టి నేర్పుగా ముందుకు సాగటమే కయాకింగ్‌. ప్రశాంతమైన నీటిలోనూ చేయవచ్చు కానీ ప్రవహించే నీటిలోనే దీని అసలైన మజాను ఆస్వాదించగలము.
  • తాడు సాయంతో ఎత్తైన పర్వతాలను ఓపికగా అధిగమిస్తూ శిఖరాన్ని చేరటమే పర్వతారోహణ. పర్వతారోహణ. హిమాలయ ప్రాంతాలతో బాటు దేశంలోని పలు విభిన్న ప్రదేశాలలో దీని శిక్షణ, నిర్వహణ నిమిత్తం ఎన్నో క్లబ్స్ ఉన్నాయి.
  • మందపాటి పెద్ద గాలి బుడగలో నిలబడి నీటిలో, నేలమీది ఎత్తైన ప్రాంతం నుంచి గాలివాటాన్ని బట్టి దిగువకు దొర్లుకుంటూ రావటమే జోర్బింగ్. సరికొత్త అనుభూతినిచ్చే ఈ క్రీడలో ప్రమాదాల బెడద తక్కువే. కాబట్టి ఎవరైనా సాధన చేయొచ్చు.
  • మంచుతో నిండిన పర్వత ఉపరితలంపై చేతి కర్రలు, షూ ధరించి వేగంగా దిగువకు సాగటం, అంటే ఊపుతో తిరిగి పైకి చేరటమే స్కీయింగ్‌. మన దేశంలో కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు దీనికి అనుకూలమైన ప్రదేశాలు.

గమనిక: పైన చెప్పిన క్రీడల సాధనకు ఆసక్తితో బాటు తగినంత శారీరక దృఢత్వం, స్పష్టమైన అవగాహన, గుండెబలం, శిక్షణ, సాధన అవసరం. ఏదైనా బృందంలో చేరి కొంత అనుభవం పొందిన తర్వాతే వీటిని పూర్తి స్థాయిలో సాధన చేయాలి తప్ప నేరుగా కాదు. ఆ తర్వాతైనా నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే సాధన చేయాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE