సంస్కృత భాషలో భుజంగం అంటే పాము. పడగ విప్పిన పాము నిలిచినట్లుగా ఉండే భుజంగాసనం అన్ని వయసుల వారికీ అనుకూలమైన ఆసనం. తగినంత సమయం ఉన్నప్పుడు ఈ ఆసనాన్నిసాధన చేయాలి.  పేరుకు ఒక ఆసనంగా కనిపించే భుజంగాసనంలో శలభాసనం, ధనురాసనాలు భాగంగా ఉంటాయి.  

చేసే విధానం

 • బోర్లా పడుకోవాలి.
 • కాలిమడమలను బొటనవేళ్లను కలిపి ఉంచాలి.
 • గడ్డం నేలకు ఆనించాలి.
 • అరికాళ్లు పై వైపుకు తిరిగి ఉండాలి.
 • రెండు చేతులను ఛాతీకి దగ్గరగా నేలమీద ఉంచాలి.
 • కొద్దిగా శ్వాస పీల్చి, పాము పడగెత్తినట్లు తలపైకి ఎత్తి నడుమును వెనుకకు వీలైనంత వరకు వంచాలి.
 • బొడ్డు నేలకు అంటీ అంటనట్లుగా ఉంచండి.
 • కొద్ధి క్షణాలు తరువాత మెల్లగా తలను నేలపై ఆనించాలి.
 • కొద్ది క్షణాలు మకరాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. 

ప్రయోజనాలు

 • రోజంతా కంప్యూటర్ మీద పనిచేసే ఉద్యోగులకు వచ్చే వెన్ను,మెడ సమస్యలకు ఈ ఆసనం చక్కని విరుగుడు.
 • రుతు సమస్యలున్న మహిళలు రోజూ ఈ ఆసనం సాధన చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
 • అండాశయం, మూత్రాశయ సమస్యలను ఇది నివారిస్తుంది.
 • గర్భసంచి, నడుము భాగాల్లోని నరాలను ఉత్తేజితం చేస్తుంది.
 • మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం ఈ ఆసనం వేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
 • రోజూ ఈ ఆసనం వేస్తే లోబీపీ సమస్య దూరమవుతుంది.
 • మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. 

గమనిక

ఈ ఆసనం వేసేటప్పుడు శరీరబరువును వెన్నుపూస మీద పడకుండా కేవలం  చేతుల మీద మాత్రమే మోపాలి.Recent Storiesbpositivetelugu

ఒత్తిడిని వదిలించే చిట్కాలు 

ఈ రోజుల్లో పట్టణ , నగరవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవితాలను గడుపుతున్నారు. కుటుంబ సమస్యలు, 

MORE
bpositivetelugu

కార్తీక నియమాలతో ఆరోగ్యం

మన భారతీయ సంస్కృతి నేర్పే సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమైనవే గాక మంచి ఆరోగ్యాన్నీ అందించేవి. కార్తీకమాస నియమాలే 

MORE