కటి అంటే నడుము. ఈ ఆసనంలో నడుమును గుండ్రంగా  తిప్పుతారు గనుక దీనిని కటిని తిప్పే ఈ ఆసనాన్ని కటి చక్రాసనం అంటారు. 

ఇలా చేయాలి

చదునైన నెల మీద కళ్ళను దగ్గరగా ఉంచి  నిటారుగా నిల్చోవాలి. దృష్టిని ఎదురుగా కేంద్రీకరించాలి. రెండు కాళ్ళ మధ్య ఒక్కటిన్నర అడుగు దూరం ఉండేలా నిలబడి రెండు చేతులను ముందుకు చాచాలి. చేతులు ఒకదానికొకటి సమాంతరంగా ఉండాలి. ఇప్పుడు గాలి దీర్ఘంగా పీల్చుకొని గాలి వదులుతూ కుడిపక్కగా వీలున్నంతవరకూ తిరగాలి. పాదాలను కదలకుండా  నడుము నుంచి తల వరకు  మాత్రమే తిరగాలి. వెనక్కి తిరిగినప్పుడు కూడా చేతులు ఒక్కదానికొకటి సమాంతరంగానే ఉంచాలి. నాలుగు నుంచి 6 సెకన్ల పాటు ఆగి గాలి పీల్చుకుంటూ ముందుకు తిరగాలి. ఇలా ఒకసారి కుడిపక్కగా మరోసారి ఎడమ పక్కకు..  మొత్తం 10సార్లు చేయాలి. 

ఉపయోగాలు

  • నడుము నుంచి తల వరకు ఉండే శరీరభాగాలకు ఇది చక్కని వ్యాయామం.
  • తొడలు , నడుము చుట్టూ పేరుకున్న అదనపు కొవ్వును ఈ ఆసనం కరిగిస్తుంది.
  • ఆర్థ్రరైటిస్ సమస్య ఉపశమిస్తుంది. 

గమనిక

స్పాండిలైటిస్, భుజం గాయాలతో బాధపడేవారు ఈ  ఆసనాన్ని వేయరాదు. ఆసనం వేయటానికి ముందు తప్పక  తేలికపాటి వ్యాయామం చేయాలి. 



Recent Stories







bpositivetelugu

చదివింది బాగా గుర్తుండాలంటే..

 కొందరు విద్యార్థులు ఏడాది మొదటినుంచి ఏరోజు పాఠాలు ఆరోజు చదువుతారు. కానీ పరీక్షల్లో కష్టపడినంతగా రాణించలేరు.  

MORE
bpositivetelugu

అభీష్ట ప్రదాయని.. లలితా పరా భట్టారిక

త్రిపురత్రయంలో రెండో శక్తి లలితా త్రిపుర సుందరి. త్రిమూర్తుల కంటే ముందున్న కారణంగా త్రిపుర 

MORE