చేతి వేళ్లను ప్రత్యేకమైన భంగిమలో నిర్దిష్ట సమయంపాటు ఉంచటమే ముద్ర. ఇది ఒక ఆధ్యాత్మిక సూచన. చెట్టుకు జీవం వేర్లు ఎలాగో, మీ శరీరానికి వేళ్లు అలా. మన దేహంలో ఎక్కడెక్కడి నుంచో మొదలయ్యే నరాలన్నీ వేళ్ల చివరి అంచుల దగ్గర ఆగిపోతాయి. చేతికున్న అయిదువేళ్లు పంచభూతాలకు ప్రతీక. బొటనవేలు అగ్ని, చూపుడువేలు వాయువు, మధ్యవేలు ఆకాశం, ఉంగరపు వేలు భూమి, చిటికెన వేలు వరుణులను సూచిస్తాయి.ఒక్కో ముద్రను ఒక సంకేత పరమైన అర్ధం కూడా ఉంది. పలు హిందూ దేవతల మొదలు బుద్ధుని వరకు వేరు వేరు ముద్రలలో కనిపించటం తెలిసిందే. ఒక్కో ముద్రకు నిర్దిష్టమైన పేరు, భంగిమ, ప్రయోజనం ఉంటాయి. యోగాతోబాటు నాట్యం, యుద్ధవిద్యల్లో ముద్రలకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. తాంత్రిక కర్మకాండల్లో 108 ముద్రలు ఉపయోగిస్తారు. భరత నాట్యంలో దాదాపు 200, మోహినీ అట్టంలో 250 రకాల ముద్రలు ఉన్నాయి. రోజూ  కొద్దిసేపు ఈ ముద్రలను సాధన చేయటం ద్వారా చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ముద్రల  వివరాలను తెలుసుకుందాం. 

జ్ఞానముద్ర

చూపుడు వేలిని బొటన వేలితో తాకుతూ ఉంచి, మిగిలిన మూడు వెళ్ళాను నిటారుగా, ఒకదానికి మరొకటి తాకుతూ ఉంచితే అది జ్ఞానముద్ర. బొటనివేలు చివర్లలో పిత్త, వినాళ గ్రంధి (ఎండొక్రైన్‌ గ్లాండ్‌) కేంద్రాలు ఉంటాయి. చూపుడువేలితో ఈ రెండు గ్రంథుల కేంద్రాలను నొక్కినప్పుడు అవి మరింత చురుకుగా పని చేస్తాయి. దీన్ని రోజూ సాధన చేస్తే జ్ఞాపకశక్తి, సృజనాత్మకత పెరుగుతుంది. డిప్రెషన్‌, హిస్టీరియా, ఆగ్రహం వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.

శక్తి ముద్ర

చివరి రెండు వేళ్లను బొటనవేలితో కలపాలి. మిగిలిన రెండువేళ్లు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి. శక్తిముద్ర అన్నిటికంటే శక్తివంతమైనది. జీవన సామర్థ్యాన్ని పెంచుతుంది. దృష్టిలోపాలను సరిచేస్తూనే కంటిచూపును మెరుగుపరుస్తుంది.

పృథ్వీ ముద్ర

ఉంగరపు వేలిని బొటన వేలితో కలిపి ఒత్తిడి కలిగిస్తూ.. మిగిలిన మూడువేళ్లు ఆకాశంవైపు చూసేలా ఉంచితే అది పృథ్వీ ముద్ర. ఈ ముద్ర మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. అధికబరువును తగ్గించడమే కాదు, భవిష్యత్తులో బరువు పెరగకుండా కూడా చూస్తుంది.

 వాయు ముద్ర

బొటనవేలును కొద్దిగా వాల్చి, చూపుడువేలును సున్నా ఆకారంలో మడవాలి.  ఈ ముద్ర వల్ల కండరాలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇది మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు ఈ ముద్రను ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది. 

వరుణ ముద్ర

బొటనవేలు, చివరివేలు కలిపితే వరుణముద్ర. మిగిలిన మూడువేళ్లను ఒకదానికొకటి తాకకుండా కాస్త ఎడంగా ఉంచాలి. ఈ ముద్ర వల్ల కిడ్నీల సామర్థ్యం పెరుగుతుంది. ప్రొస్టేట్ సమస్యలు తొలగిపోతాయి. రాత్రిళ్లు పక్కతడిపే అలవాటు తగ్గిపోతుంది. కీళ్ల నొప్పుల వంటి సమస్యలు తొలగిపోతాయి. డీహైడ్రేషన్ తగ్గుతుంది. 

ఆకాశ  ముద్ర

మధ్యవేలి కొసను బొటన వేలి కొసను కలిపి పట్టుకోవాలి. దీన్ని ఆకాశ  ముద్ర అంటారు. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకి పంపుతుంది. 

శూన్య ముద్ర

మధ్యవేలుతో బొటనవేలును గట్టిగా బంధించాలి. మిగిలిన మూడు వేళ్లు నిటారుగా ఉంచాలి.

ఈ ముద్రతో చెవిపోటు తగ్గుతుంది. ఉన్నట్లుండి తలతిరగడాన్ని (వెట్రిగో) తగ్గిస్తుంది. థైరాయిడ్ సమస్యలను నయం చేస్తుంది.  రెండుమూడు రోజులు చేస్తే ఫలితం ఉండదు. రెగ్యులర్‌గా చేయాలి. 

సూర్య ముద్ర

బొటనవేలు, ఉంగరంవేలు రెండూ మడవాలి. మిగిలిన మూడువేళ్లు నిటారుగా పెట్టుకోవాలి. ఈ ముద్ర రెగ్యులర్‌గా చేస్తే, మానసిక నిగ్రహం పెరుగుతుంది. అధిక ఒత్తిళ్ల వల్ల వచ్చే మధుమేహాన్ని నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతుంది.  జీర్ణాశయ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. దృష్టి సంబంధ సమస్యలు తొలగిపోతాయి. బరువు కూడా తగ్గుతారు.

నిమయాలు

  • వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఈ ముద్రలు సాధన చేయవచ్చు.
  • ఎక్కడైనా, ఎప్పుడైనా, ప్రయాణంలో, పడుకొని కూడా సాధన చేయవచ్చు. అయితే పద్మాసనంలో కూర్చొని ముద్రలు చేపట్టడం శ్రేష్ఠం. పరిగెత్తిన తర్వాత లేదా వేగంగా నడిచిన తర్వాత వెంటనే గాక 10 నిమిషాలు ఆగి ముద్రలను సాధన చేయాలి.
  • ముద్రలను రెండు చేతులతో చేయాలి.
  • ముద్రలు సాధన చేసే క్రమంలో చేతివేళ్ళను గట్టిగా ఒత్తాల్సిన పనిలేదు. తేలికగా ఆనిస్తే చాలు.
  • రోజూ కనీసం 45 నిముషాల పాటు ముద్రలను సాధన చేయాలి.
  • శూన్యముద్ర, వాయుముద్రల సాధన చేసేవారు సంబంధిత ఆనారోగ్యం తగ్గగానే ఆపివేయాలి.
  • కొత్తగా సాధన చేసేవారు 10 నిముషాల పాటు సాధన చేస్తూ క్రమంగా రోజుకు 2 నిమిషాల చొప్పున పెంచుకొంటూ పోవాలి. ఉదయం , సాయంత్రం పావుగంట పాటు సాధన చేయాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE