వెన్నెముకను ఉత్తేజపరచటంతో బాటు మీద, వీపు, నడుము కండరాల కదలికలను సరళతరం చేసి ఆసనాల్లో వక్రాసనం ఒకటి. రోజూ ఈ ఆసనం సాధన చేస్తే జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. చేతులు, కాళ్ళు బలోపేతమవుతాయి. మహిళల్లో జననేంద్రియ సమస్యలు, గర్భాశయ సమస్యలు తొలగటమే గాక ఋతు సంబంధ సమస్యలు దూరమవుతాయి.

చేసే పద్ధతి

  • ముందుగా చదునైన నేలమీద సుఖాసనంలో కూర్చోవాలి.
  • కాళ్లను ముందుకు చాపాలి.
  • నెమ్మదిగా ఎడమ పాదమును కుడి పిరుదుల క్రింద ఉంచాలి.
  • కుడి పాదాన్ని ఎడమ మోకాలి దగ్గర నేలకు ఆన్చుతూ నిలపాలి.
  • కుడిచేతిని వెనుకకు తీసుకుని వెళ్ళాలి.
  • ఎడమ మోచేతిని కుడిమోకాలికి తాకిస్తూ ఎడమ చేతితో కుడి పాదము పట్టుకోవాలి.
  • శ్వాస తీసుకుంటూ తలను ఎడమభుజంవైపుకు తీసుకువెళ్ళాలి.
  • శ్వాసను వదులుతూ మామూలుస్ధితికి తీసుకురావాలి.
  • ఇదే విధంగా కుడి కాలిని ఎడమకాలిక్రింద ఉంచుతూ ఆసనాన్ని సాధన చేయాలి. 

గమనిక: వీపు, మెడ నొప్పి ఉన్నవారు, కీళ్ల సమస్యలున్నా వారు ఈ ఆసనం వేయరాదు. 



Recent Stories







bpositivetelugu

చదివింది బాగా గుర్తుండాలంటే..

 కొందరు విద్యార్థులు ఏడాది మొదటినుంచి ఏరోజు పాఠాలు ఆరోజు చదువుతారు. కానీ పరీక్షల్లో కష్టపడినంతగా రాణించలేరు.  

MORE
bpositivetelugu

అభీష్ట ప్రదాయని.. లలితా పరా భట్టారిక

త్రిపురత్రయంలో రెండో శక్తి లలితా త్రిపుర సుందరి. త్రిమూర్తుల కంటే ముందున్న కారణంగా త్రిపుర 

MORE