వెన్నుపూస నొప్పి, ఉదర సంబంధిత సమస్యలకు విపరీత నౌకాసనం చక్కని ఫలితాన్నిస్తుంది. రోజూ దీని సాధన చేసే వారి  భుజాలు, మెడ  దృఢంగా తయారవుతాయి. ఛాతీ పెరగటమే గాక  ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని, పరిమాణాన్ని పెంచుతుంది. ఈ ఆసనాన్ని చదునైన నేలపై సాధన చేయాలి. ఈ ఆసనం వేసినప్పుడు మన శరీరం నౌక ఆకారంలో మారుతుంది గనుకే దీనికి ఆ పేరు వచ్చింది.  

సాధన చేసే పద్దతి

  • ఉదరం, ఛాతీ భాగం నేలను తాకేలా బోర్లా పడుకోవాలి. నుదురు నేలను తాకేలా ఉంచాలి.
  • ఇప్పుడు చేతులను సమాంతరంగా ముందుకు చాచాలి.
  • నేలపై ఆనించిన నుదటి భాగాన్ని రెండు భుజాల మధ్యన ఉండేలా చూసుకోవాలి. భుజాలు ఖచ్చితంగా చెవులను తాకుతూ ఉండాలి.
  • ఇప్పుడు నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ కాళ్ళు, మెడ, భుజాలు, తల భాగాలను మెల్లగా లేపాలి.
  • మోచేతులు, మోకాళ్ళు వంచరాదు. కుదుపులు లేకుండా చేసుకోవాలి.
  • పాదాలు ఒకదానికొకటి తాకుతూ ఉంచాలి.
  • తలను వీలైనంతగా పైకి లేపాలి.
  • ఇప్పుడు సాధ్యమైనంత మేరకు విల్లు మాదిరిగా వెనక్కు వంగాలి.
  • క్రమంగా మొత్తం శరీర బరువును పొత్తి కడుపు కింది నిలిపే స్థితికి రావాలి.
  • కనీసం 10 సెకనులపాటు ఈ భంగిమలో శ్వాస బిగపట్టి ఉంచి మెల్లగా గాలి వదులుతూ ప్రారంభదశకు చేరుకోవాలి.
  • శవాసన దశకు చేరుకుని విశ్రాంతి తీసుకోవాలి.



Recent Stories







bpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE