తాడాట గురించి తెలియనివారుండరు. తల మొదలు పాదాల వరకు కదిలించే ఈ తాడాట నడక, ఎరోబిక్స్, ఈత, జంపింగ్, జాగింగ్, రోప్, టెన్నిస్ లాంటి కార్డియోవాస్కులార్ వ్యాయామాలకు ఏమాత్రం తీసిపోని వ్యాయామం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చేయదగిన సులువైన వ్యాయామమిది. తాడాట ఉపయోగాలు, దానికి సంబంధించిన కొన్ని సూచనల గురించి తెలుసుకుందాం.

ఉపయోగాలు

 • రోజూ కనీసం 10 నిమిషాలు తాడాట ఆడితే ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరిగి ఊబకాయం సమస్య రాదు. అరగంట తాడాట ఆడితే 450 కేలరీలు ఖర్చవుతాయి.
 • అవయవాలు వేగంగా కదిలించేందుకు తోడ్పడటమే గాక అవయవాల మధ్య సమన్వయం కుదురుతుంది.
 • రోజూ తాడాట ఆడేవారి ఎముకలు, కీళ్లు బలపడటంతో బాటు చర్మంపై ఏర్పడ్డ ముడతలు తొలగిపోతాయి.
 • తాడాట వల్ల గుండెలయ క్రమబద్ధం అవుతుంది.
 • పిక్కలు, తొడ, నడుము, చేతి కండరాలు బలపడతాయి.
 • అధిక రక్తపోటు సమస్యను తాడాట నివారిస్తుంది.
 • ఈ ఆట గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
 • శ్వాస, రక్త ప్రసరణ వ్యవస్థల పనితీరు ఇతోధికంగా మెరుగుపడుతుంది. 

ఆడే పద్దతి

 • తాడాటకు ముందు కాసేపు వాకింగ్ లేదా జాగింగ్ చేయాలి.
 • కొత్తగా తాడాట ఆడేవారు తొలినాళ్లలో కేవలం 5 నిమిషాలు ఆడుతూ క్రమంగా రోజుకు కొంత సమయం పెంచుకుంటూ పోవాలి.
 • ఏ మాత్రం కంగారు పడకుండా శరీరాన్ని వీలున్నంత మేర వంచి తాడాట ఆడాలి.
 • ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఆగి తగిన విరామం తీసుకొని మళ్ళీ ఆడాలి.

జాగ్రత్తలు

 • తాడాట ఆడేటప్పుడు తప్పక షూస్ వేసుకోవాలి. లేకుంటే పాదాలకు నొప్పి కలగటంతోబాటు పగుళ్లు ఏర్పడతాయి.
 • మట్టినేలమీద లేదా మందపాటి కార్పెట్ మీద మాత్రమే తాడాట ఆడాలి. సిమెంట్ రోడ్లు, నునుపైన ఫ్లోరింగ్ మీద తాడాట ప్రమాదం.
 • ఆటకు మీడియం సైజు తాడునే వాడాలి. అది పొరబాటున కూడా కాళ్ళకు తాకకూడదు. అలాగని మరీ పొడవుగా ఉండకూడదు.
 • హృదయ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, ఎముకల గాయాలున్నవారు ఫిట్‌నెస్ నిపుణుల సలహా మేరకు మాత్రమే తాడాట ఆడాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE