ఈ ఆసనపు భంగిమ బుసకొట్టే పామును పోలి ఉంటుంది గనుక దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఆసనం రోజూ సాధన చేయటం ద్వారా నడుము, చేతులకండరాలు బలోపేతం గావటమే గాక నడుము చుట్టూపేరుకున్న అధిక కొవ్వు కరిగిపోతుంది.
చేసే పద్దతి
ముందుగా బోర్లా పడుకోవాలి. చేతులు రెండు ఛాతి పక్కగా పెట్టాలి. ఇప్పుడు గాలి పీలుస్తూ నెమ్మదిగా రెండు చేతులను వెనక్కు కలిపి పిరుదులకు సమాంతరంగా ఉంచాలి. శరీర బరువు మొత్తాన్ని ఉదరం, నడుము మీద నిలుపుతూ తల, కాళ్లను వీలున్నంత మేర పైకి లేపాలి .ఇదే భంగిమలో వీలున్నంత సమయం ఉండి నెమ్మదిగా బోర్లా పడుకుని కాస్త విరామం తీసుకొని తిరిగి సాధన చేయాలి.
ఉపయోగాలు
గమనిక: హృదయ సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు ఉన్నవారు ఈ ఆసనాన్ని జాగ్రత్తగా చేయాలి. హెర్నియా, అల్సర్ ఉన్నవాళ్లు అస్సలు దీన్ని చేయకూడదు.