కీళ్ల నొప్పుల బాధితులకు మేలు చేసే ఆసనాల్లో అర్థ చంద్రాసనం ఒకటి. ఈ ఆసనపు భంగిమ నెలవంకను పోలినట్లు ఉంటుంది గనుక దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఆసన సాధనా పద్దతి, ఉపయోగాల గురించి తెలుసుకుందాం.

సాధన పద్దతి

  • ముందుగా సమతల ప్రదేశంలో నిటారుగా నిలబడాలి.
  • నెమ్మదిగా కాళ్ళు దూరం జరపాలి. రెండు కాళ్ళ మధ్య దూరం 2 అడుగులు ఉండేలా చూసుకోవాలి.
  • తరువాత రెండు చేతులను భుజాలకు సమాంతరంగా చాచాలి.
  • నెమ్మదిగా శ్వాస తీసుకుని శరీర బరువంతా కుడికాలు మీద మోపి శరీరాన్నికుడిపక్కకు వంచి కుడిచేయి మునివేళ్ళను నేలకు ఆనించాలి.
  • ఇదే సమయంలో ఎడమ చేయి, ఎడమ కాలును వీలున్నంత మేర నిటారుగా లేపాలి .
  • ఈ భంగిమలో కనీసం అర నిమిషంపాటు ఉండి నెమ్మదిగా శ్వాస వదిలిఆ తరువాత గాలి పీలుస్తూ తిరిగి నిటారుగా నిలబడాలి.
  • ఇదే విధంగా ఈ సారి ఎడమ కాలిపై శరీరబరువు ఉంచి కుడి కాలిని, చేతిని పైకి లేపాలి.
  • ఇలా రోజుకు 5 సార్లు చొప్పున సాధన చేయాలి.

ఉపయోగాలు

  • రోజంతా ఒకే భంగిమలో కూర్చొని పనిచేసేవారికివచ్చే కీళ్లు ,వెన్ను, తొంటి సమస్యలకు ఈ ఆసనం చక్కని విరుగుడు.
  • స్పాండిలోసిస్, సయాటికా, కీళ్లు స్థాన భ్రంశం చెందటం వంటి సమస్యలున్న వారు రోజూ ఈ ఆసనం సాధన చేస్తే సమస్య ఉపశమిస్తుంది.
  • ఈ ఆసనాన్ని క్రమంతప్పకుండా సాధన చేస్తే వెన్ను కండరాలు బలపడివెన్నుపూసల మీద పడే భారం తగ్గుతుంది.



Recent Stories







bpositivetelugu

ఒత్తిడిని వదిలించే చిట్కాలు 

ఈ రోజుల్లో పట్టణ , నగరవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవితాలను గడుపుతున్నారు. కుటుంబ సమస్యలు, 

MORE
bpositivetelugu

కార్తీక నియమాలతో ఆరోగ్యం

మన భారతీయ సంస్కృతి నేర్పే సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమైనవే గాక మంచి ఆరోగ్యాన్నీ అందించేవి. కార్తీకమాస నియమాలే 

MORE