సిక్స్ ప్యాక్ ఆబ్స్ పొందడానికి రహస్యమైన పద్దతి  ఏమి లేదు. కొన్ని పద్దతులను అనుసరిస్తూ, సులువుగా సిక్స్ ప్యాక్ ఆబ్స్ ను పొందవచ్చు. చాలా మందికి వారి విధుల వల్ల తగినంత సమయం దొరకక శరీరంపై శ్రద్ద వహించరు, కానీ మీ అలవాట్లలో కొన్ని మార్పులను చేయటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ కింద విధంగా వ్యాయామాలతో మీ తినే అలవాట్లని మార్చుకుంటే చాలు. ఆబ్స్ పొందుటకు అలవాట్లలో చేయాల్సిన మార్పుల గురించి కింద పేర్కొనబడింది.


కోర్ కండరాలపై వ్యాయామం

సిక్స్ ప్యాక్ అబ్స్ పొందడానికి మీరు చేయాల్సిందల్ల మీ ఉదరం పైన కొవ్వుని తీసివేస్తే చాలు. మీరు ఒక్కసారి మీ ఉదరం పైన కొవ్వు ని తొలగించుకోగానే మీకు ఫోర్ ప్యాక్, సిక్స్ ప్యాక్ లేదా ఎయిట్ ప్యాక్ తెచ్చుకోవచ్చు. మీరు మొదట కోర్ కండరాలపై వ్యాయామం మొదలుపెట్టాలి. రివర్స్ క్రంచెస్ వల్ల మీ కింద అబ్స్ బలపడుతాయి. రివర్స్ క్రంచెస్ అంటే క్రంచెస్లగానీ కానీ మీరు మీ కాళ్ళని మీదకు లేపాలి. మొదట కింద పడుకొని మీ చేతులని అర చేతులు కిందకు ఉండేలా కింద పెట్టండి తరువాత మీ కాళ్ళను పైకి తల వైపు లేపి కొంచం సేపు ఆపి మళ్ళి కిందకు పెట్టండి. లేదా మీరు ప్లాంక్ సహాయం కూడా తీసుకోవచ్చు.


బరువుకి సంబంధించిన శిక్షణ

శక్తి సంబంధిత శిక్షణ మరియు బరువుకి సంబంధించిన శిక్షణలు చాలా ముఖ్యమైనవి వీటి వల్ల మీకు బలమైన భుజాలు, చేతులు మరియు వెన్నుముక కూడా కావాలి. మీ అబ్స్ మాత్రమే కాకుండా మీ శరీరం కూడా బలంగా ఉండాలి. బరువుకి సంబంధించిన శిక్షణ వల్ల మీ కండరాలకు మంచి ఆకారంతో పాటు, మీ జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. జిమ్ లో బరువులు ఎత్తినపుడు మీ కండరాలు పెరుగుతాయి, ప్రతి శరీర భాగంఫై వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం లో సమతుల్యం ఏర్పడుతుంది.

కార్డ్యో బ్లాస్ట్

మీ ఉదరం పైన కొవ్వుని తీసివేయడం, వల్లనే మీరు సిక్స్ ప్యాక్ అబ్స్ పొందగలరు. వెయిట్ లిఫ్టింగ్ ఎంత ముఖ్యమో, కార్డియో వ్యాయామాలు కూడా అంతే ముఖ్యం. కార్డియో అనగానే రన్నింగ్ ఒకటే కాదు స్విమ్మింగ్ లేదా టెన్నిస్ లాంటి అరుదైన ఆట లేదా సైక్లింగ్, బాక్సింగ్ ఎదైన మీకు నచ్చిన వాటిని చేయండి. మీ వ్యక్తిగత వ్యాయమ ప్రణాళికను తయారు చేసుకొండి దాని వల్ల మీరు చూస్తుండగానే సిక్స్ ప్యాక్ తెచ్చుకోవచ్చు


కార్బోహైడ్రేట్స్

మంచి కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. తెల్ల కార్బోహైడ్రేట్స్ ని ఎంచుకోండి వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల నెమ్మదిగా జీర్ణం చెందించబడతాయి. బ్రౌన్ రైస్ , క్యునోవ, ఒట్స్ వీటి మంచి ఉదాహరణలుగా చెప్పవచ్చు.


ప్రోటీన్స్

తరుచు జీమ్ కి వెళ్ళే వాళ్ళు ప్రోటీన్స్ గురించి మాట్లాడం వీనే ఉంటారు; ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల మన కండరాలు పెరుగుతాయి. ఈ మద్య కాలం పరిశోధనలో ఉదయం భోజనంలో 35గ్రాముల ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల రోజులో తక్కువ ఆకలి అవుతుందని తేలింది. కోడి గుడ్లు, పెరుగు, బకాన్, లీన్ మీట్, చికెన్, పండ్లు లాంటివి తీసుకోవాలి.


నీరు మరియు నిద్ర

సోడా మరియు పండ్ల రసాలు, నీళ్లకు బదులుగా తాగకండి దీని వల్ల అవసరం లేని క్యాలరీలు శరీరానికి అందించబడతాయి. అంతేకాకుండా, మీ శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా చూసుకోండి. రోజు ఎనిమిది నుండి తొమ్మిది గంటల పాటు నిద్ర చాలా అవసరం.


సిక్స్ ప్యాక్ తెచ్చుకోవడం సులువు కాదు. కానీ ఓపికతో చేస్తే ఫలితాలు ఇట్టే కనబడుతాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE