హలం అంటే నాగలి. ఈ ఆసనపు భంగిమ ఆ తీరున ఉంటుంది గనుక దీనికి ఈ పేరు వచ్చింది. యోగాసనాలలో దీనిది ప్రముఖ స్థానం. ఈ ఆసనం వేసినప్పుడు అన్ని అవయవాల్లోనూ చలనం కలిగి ఎంతటి అలసట, మానసిక ఒత్తిడైనా వదిలిపోతుంది. మన శరీరపుకీలక భాగాలైన గుండె, మెదడు, శ్వాసకోశాలను చైతన్యపరిచే శక్తి ఉన్న హలాసనం సాధన చేసే తీరు, సమకూరే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చేసే పద్ధతి

 • చదునైన నేల మీద కాళ్లు చేతులను నిటారుగా చాచి వెల్లికలా పడుకోవాలి.
 • నాలుగైదు సార్లు శ్వాసను దీర్ఘంగా తీసుకొని వదలాలి.
 • తర్వాత నెమ్మదిగా శ్వాసతీసుకుంటూ వీపుకు చేతులను ఆధారంగా పెట్టుకొని కాళ్ళను పైకి లేపాలి.
 • కాళ్ళను నిటారుగా పైకి లేపిన తర్వాత నెమ్మదిగా శ్వాస వదులుతూ కాళ్ళను తల వెనుక భాగం వైపు నాగలిలా వంచాలి.
 • కాలి ముని వేళ్ళు భూమిని తాకించేందుకు ప్రయత్నించాలి.
 • ఈ భంగిమలో 1 నిమిషమున్న తర్వాత కాళ్ళను నెమ్మదిగా పైకి లేపుతూ నిటారుగా నిలబెట్టాలి.
 • తర్వాత శ్వాస తీసుకుంటూ తిరిగి మొదటి భంగిమలోకి రావాలి.
 • ఇలా రోజూ ఉదయం లేదా సాయంత్రం పూట మూడు సార్లు వేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఉపయోగాలు

 • ఊపిరితిత్తుల పనితీరును ఈ ఆసనం ఎంతో మెరుగుపరుస్తుంది.
 • థైరాయిడ్, బహిస్టు సమస్యలు, జీర్ణకోశ సమస్యల బాధితులు రోజూ ఈ ఆసనం సాధన చేస్తే సమస్య అదుపులో ఉంటుంది.
 • కంప్యూటర్లపై పనిచేసేవారి మొదలు నీడ పట్టున పనిచేసే అన్ని వృత్తులవారు రోజూ ఈ ఆసనం సాధన చేస్తే అలసిన శరీరం సేదదీరుతుంది.

ఛాతీ, భుజాలు, మెదడు, కళ్ళు తదితర భాగాలకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

 • పిరుదులు, పిక్కలు, వెన్నుపూసకండరాలు, నడుము నరాలు బలపడతాయి.
 • పొట్టలోని ప్రేగులు, కండరాలు బలోపేతం అవుతాయి.
 • సంతానం కలగని మహిళలు ఈ ఆసనం సాధన చేస్తే గ్రంథుల పనితీరు మారి సంతానం కలుగుతుంది.
 • ఈ ఆసనం వేసేవారికి హెర్నియా సమస్య రాదు.

గమనిక

 • నెలసరి సమయంలో, గర్భం ధరించిన తొలి3 నెలల వరకూ ఈ ఆసనం వేయకూడదు.
 • హలాసనాన్ని ఖాళీ కడుపుతోనే సాధన చేయాలి.
 • నడుమును నేలకు అనించటం, కాళ్ళను ఎక్కువగా కదిలించకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తప్పనిసరి.Recent Storiesbpositivetelugu

ఒత్తిడిని వదిలించే చిట్కాలు 

ఈ రోజుల్లో పట్టణ , నగరవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవితాలను గడుపుతున్నారు. కుటుంబ సమస్యలు, 

MORE
bpositivetelugu

కార్తీక నియమాలతో ఆరోగ్యం

మన భారతీయ సంస్కృతి నేర్పే సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమైనవే గాక మంచి ఆరోగ్యాన్నీ అందించేవి. కార్తీకమాస నియమాలే 

MORE