మంచి శరీరాకృతిని కోరుకునేవారికి, ఉల్లాసవంతమైన వ్యాయామం కోరుకునేవారికి ఈత చక్కని ప్రత్యామ్నాయం. ఇతర వ్యాయామాలు శరీరంలోని కొన్ని భాగాలను మాత్రమే బలోపేతం చేస్తాయి. అయితే ఈత మాత్రం శరీరంలో తల మొదలు పాదాల వరకు అన్ని భాగాలనూ కదిలించి ఉత్తేజితం చేస్తుంది. పైగా ఇది అన్ని కాలాల్లో, అన్ని వయసుల వారూ చేయదగిన మేలైన, సులువైన వ్యాయాయం.

ఉపయోగాలు

 • రోజూ ఈత కొట్టే వారిలో మెదడు పనితీరు, జీర్ణశక్తి మెరుగుపడతాయి.
 • రోజూ ఈత కొడితే శరీరానికి మర్దన చేసినంత అనుభూతి కలిగి విశ్రాంతి లభిస్తుంది. రోజంతా పనిచేసి అలసిపోయిన కండరాలకు చెప్పలేనంత ఊరట లభిస్తుంది.
 • చన్నీళ్లతో ఈత కొడితే రక్త ప్రసరణ మెరుగుపడటమే గాక గుండెకు చక్కని వ్యాయామంగా పనిచేస్తుంది.
 • జీవక్రియలు ఊపందుకునేలా చేయటం ద్వారా శరీరంలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది.
 • ఈత రానివారు కనీసం అరగంటపాటు రోజూ ఈత కొలనులో నడిచినా ఈత కొట్టిన ఫలితాన్ని పొందవచ్చు.
 • ఈత కొట్టేటప్పుడు బరువంతా నీటిపైనే పడిమోకాళ్లు, తుంటి, వెన్నెముకల మీద ఏ ఒత్తిడీ ఉండదు.
 • ఈత కొట్టేవారికి గాయాలు కావటం, ఎముకలు విరగటం వంటి ఇబ్బందులు ఉండవు.
 • రోజూ గంట పాటు 10 రోజులు ఈత కొడితే పొట్ట తగ్గటమే గాక ఉదర కండరాలు బలపడి మంచి ఆకారాన్ని పొందుతాయి.
 • వ్యాయామంతో పాటు ఈత కొట్టే వారు వయసు పైబడినా యువకుల్లానే కనిపిస్తారు.
 • రోజుకు అరగంటపాటు ఈత కొడితే 300 క్యాలరీలు కరిగినట్లే. ఊబకాయులువారంలో కనీసం నాలుగు రోజులు అరగంటపాటు ఈత కొడితే 3 వారాలలో బరువు తగ్గటం మొదలవుతుంది.
 • ఆటగాళ్లు ఈత కొడితే కాలి, చేతి, కండరాలు దృఢంగా తయారవుతాయి. ఆటసమయంలో ఒత్తిడినీ అధిగమించగలరు.

గమనిక

 • భోజనం చేసిన వెంటనే ఈత కొట్టకూడదు.
 • గర్భం ధరించిన3 నెలల వరకు ఈత జోలికి వెళ్ళరాదు.
 • ఈత కొలను నీటిలో ఉండేక్లోరిన్ మూలంగా చర్మం దురద, మంటెక్కే ప్రమాదం ఉన్నందున సొరియాసిస్ బాధితులు ఈత కొట్టరాదు.
 • ఈత అంటే ఎంత ఉత్సాహం, ఆసక్తీ ఉన్నా ఈత నేర్చుకున్నాకే నీటిలో దిగాలన్నది మర్చిపోకండి. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE