శశాంకం అంటే కుందేలు. ఆ ఆసనం చూసేందుకు కుందేలు కూర్చున్నట్లు ఉంటుంది గనుక దీనికి ఆ పేరు వచ్చింది. కుందేలు ఎంత దూరం పరుగెత్తినా అలసిపోనట్టేరోజూ ఆసనం వేసేవారు కూడా పరుగెత్తినప్పుడు త్వరగా అలసిపోరు. పైగా ఎంతటి మానసిక ఒత్తిడి అయినా దూరమవుతుంది.

సాధనా విధానం

ముందుగా వ‌జ్రాస‌నంలో కూర్చొవాలి. త‌ర్వాత శ్వాస తీసుకుంటూ రెండు చేతులు నెమ్మదిగా పైకి లేపి ముందుకు వాలాలి. శ్వాసను వదులుతూ శరీర భారాన్ని మోకాళ్ళమీద నిలుపుతూ నుదురు, అరచేతులను నేలకు ఆనించాలి. కొన్ని క్షణాల తర్వాత తిరిగి శ్వాస‌ను తీసుకుంటూ తిరిగి వజ్రాసన భంగిమకు రావాలి. ఇలా రోజుకు ప‌ది నుండి 12సార్లు చేయాలి.

ఉపయోగాలు

ఈ ఆస‌నంసాధన చేస్తే గ్యాస్‌ట్ర‌బుల్ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.మ‌ధుమేహం అదుపులో ఉంటుంది. కీళ్లు గ‌ట్టిప‌డినడుము, మెడ నొప్పులు తగ్గుతాయి. కోపం తగ్గుతుంది. కోపం వచ్చినా వెంటనే అదుపులోకి వస్తుంది. ఈ ఆసనం సాధన చేసే వారికి నడుము చుట్టూ చేరిన అదనపు కొవ్వు కరిగిపోతుంది.



Recent Stories







bpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE