శలభం అంటే మిడత. ఈ ఆసనపు భంగిమ మిడత ఆకారంలో ఉంటుంది గనుక దీనికి శలభాసనంఅని పేరు. ఈ ఆసనం రెండు రకాలు. ఈ ఆసనాన్ని ఒక కాలుతో చేస్తే ఏకపాద శలభాసనం అనీ, రెండుకాళ్ళతో చేస్తే పూర్ణ శలభాసనం అంటారు. ఇప్పుడిప్పుడే ఆసనాలు సాధన చేసేవారు ముందుగా 2 రోజులు ఏకపాద శలభాసనం సాధన చేసిపూర్ణ శలభాసనం వేయటం మంచిది. నడుము, వెన్ను సమస్యలకు ఈ ఆసనం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. 

ఏకపాద శలభాసనం

ముందుగా సమతలంగా ఉన్న నేలమీద బోర్లా పడుకుని గడ్డాన్ని నేలకు ఆనించాలి. చేతులు శరీరానికి సమాంతరంగా చాచి ఉంచాలి. శరీర బరువు భుజాలు, ఛాతీ, పొట్ట మీద నిలిపి నెమ్మదిగా గాలి పీల్చి ముందుగా కుడికాలును వీలున్నంత పైకి లేపాలి. కాలు నిటారుగాఉంచాలి. సుమారు 5 నుంచి 10 సెకన్లపాటు అదే భంగిమలో ఉంచి నెమ్మదిగా శ్వాస వదులుతూ కాలుని మునుపటి భంగిమకు తీసుకు రావాలి. ఇలా మూడు సార్లు చేసినతర్వాత ఇలాగే ఎడమకాలితో కూడా చేయాలి. 

పూర్ణ శలభాసనం

ముందుగా సమతలంగా ఉన్న నేలమీద బోర్లా పడుకుని గడ్డాన్ని నేలకు ఆనించాలి. చేతులు చాచి శరీరానికి సమాంతరంగా ఉంచాలి. భుజాలు, ఛాతీ, పొట్ట పూర్తిగా నేలను తాకుతూ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి పీల్చి రెండు కాళ్లనూ ఒకేసారి పైకి ఎత్తాలి. మొదట్లో కష్టంగా ఉన్నా సాధన చేసే కొద్దీ నడుము, పొట్ట దగ్గర కండరాలు బలోపేతమై ఎక్కువ సమయం పాటు, ఎక్కువ ఎత్తులో కాళ్ళు నిలపటం సాధ్యపడుతుంది.

ఉపయోగాలు

  • పిక్కలు, పిరుదులు, కాలి కండరాలు బలపడతాయి.
  • మహిళల్లో రుతు సంబంధమైన సమస్యలు నయం అవుతాయి.
  • వెన్నెముక దృఢంగా మారుతుంది. సయాటికా నొప్పి తగ్గుతుంది.
  • అజీర్తి, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి ఉదరకోశ సమస్యలు దూరమవుతాయి. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది .
  • మూత్రకోశ సమస్యలు తగ్గుతాయి.
  • కాన్పు అనంతరం వచ్చే నడుము నొప్పి నివారణకు ఈ ఆసనం ఉపయోగపడుతుంది.
  • మధుమేహం పూర్తిగా అదుపులో ఉంటుంది.
  • మొలల సమస్య ఉపశమిస్తుంది.
  • దెబ్బతిన్న కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE