కొత్త ఏడాదిలో తీసుకొనే సరికొత్త నిర్ణయాల్లో జిమ్ బాట పట్టాలనుకోవటం ఆహ్వానించదగిన మేలైన నిర్ణయం. అయితే తొలినాళ్లలో ఎంతో ఉత్సాహంగా జిమ్ లో కసరత్తులు చేసే యువతీయువకులు అక్కడి రొటీన్ వ్యాయామాల ధాటికి నెమ్మదిగా వ్యాయామం పట్ల ఆసక్తి కోల్పోతుంటారు. ఈ పరిస్థితిని నివారించి వ్యాయామాన్ని ఒక ఉల్లాసకరమైన వ్యాపకంగా మార్చేందుకు రూపొందించినవే డాన్సర్ సైజులు. ముఖ్యంగా వినూత్నమైన వ్యాయామాల గురించి ఆలోచించే వారంతా వీటి గురించి తెలుసుకోవాల్సిందే. 

డాన్సర్ సైజ్అంటే... 

ఎప్పుడూ చేసే డాన్స్ భంగిమలకు ఏరోబిక్స్ జోడించటమే డాన్సర్ సైజ్. వీటివల్ల శరీర కదలికల వేగం, అవయవాల మధ్య సమన్వయం పెరుగుతాయి. జిమ్ లో కూడా ఉల్లాసకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బాడీ ఫిట్ నెస్ తో బాటు మానసిక ప్రశాంతతకూ డాన్సర్ సైజులు దోహదం చేస్తాయి. కొత్తగా డాన్స్ నేర్చుకునేవారు, బిడియంతో నలుగురిలో డాన్స్ చేసేందుకు ఇబ్బందిపడేవారు డాన్సర్ సైజ్ సాధన వల్ల సానుకూలఫలితాలు పొందుతారు.

ప్రత్యేకతలు

  • డాన్స్, ఏరోబిక్స్ ల కలయికే డాన్సర్ సైజ్. ఇందులో ఏరోబిక్స్ కు గుండె వేగాన్ని పెంచే లక్షణం ఉంది. దీనివల్ల ఒంట్లో చేరిన అదనపు కేలరీలు కరిగిపోతాయి. దీనికి డాన్స్ తోడుకావటంతోమరింత తక్కువ సమయంలో, సులభంగా అదనపు కేలరీల బెడద వదిలిపోతుంది.
  • చలికాలంలో సులువుగా పెరిగే శరీర బరువును కష్టంగా గాక ఇష్టంగా తగ్గించుకునే మంచి ప్రత్యామ్నాయం.
  • చక్కని శరీర ఆకృతి, ఫిట్ నెస్ ను అందిస్తాయి.
  • రోజుకో తరహా సంగీతంతో ప్రతిక్లాస్ సరికొత్తగా, ఉల్లాసంగా ఉంటుంది.
  • అన్ని వయసుల వారూ సులువుగా, ఉత్సాహంగా సాధన చేయవచ్చు.

ముఖ్యాంశాలు

  • డాన్సర్ సైజ్ కూడా ఒక ప్రత్యేకమైన వ్యాయామమే. కనుక జిమ్ లో అడుగుపెట్టగానే నేరుగా సాధనకు దిగకుండా ముందు తేలికపాటి వ్యాయామాలతో వామప్ చేసి శరీరాన్ని డాన్సర్ సైజుకు సిద్దం చేయాలి.
  • డాన్సర్ సైజ్ వల్ల శరీరం బాగా అలసిపోతుంది గనుక సాధకులు తగినంత నీరు తాగాలి.
  • చేస్తూ చేస్తూ ఒక్కసారిగా డాన్సర్ సైజ్ ఆపకూడదు. నెమ్మదిగా వేగాన్ని తగ్గించుకొని ఆపాలి. ఆ తర్వాత 10 నిమిషాలు జాగింగ్, వాకింగ్ చేస్తూ విశ్రాంతి స్థితికి రావాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE