అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా వచ్చే తొలి సమస్య ఊబకాయం. పొత్తికడుపు దిగువన అధిక కొవ్వు పేరుకుపోవటం, శరీరాకృతిలో అవాంఛిత మార్పులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలన్నింటికీ ఈ ఊబకాయమే మూలం. అయితే త్రికోణాసన సాధన ద్వారా తక్కువ సమయంలో, సులభంగా పొత్తికడుపు భాగపు కొవ్వును కరిగించి ఊబకాయం బారినుంచి బయటపడొచ్చు.

ఇలా చేద్దాం

సమతలంగా ఉన్న చోట నిటారుగా నిలబడాలి. పాదాలను వీలున్నంత దూరంగా (కనీసం మీటరు) జరపాలి. ఇప్పుడు చేతులను భూమికి సమాంతరంగా చాచి దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. తరువాత నెమ్మదిగా శ్వాస వదులుతూ కుడి చేతిని, కుడి పాదానికి ఆన్చాలి. ఎడమచేతిని తలమీదుగా నిటారుగా చాచి తలను పైకెత్తి ఎడమ అరచేతిని చూస్తూ ఉండాలి. అర నిమిషం తర్వాత తిరిగి శ్వాస తీసుకొంటూ నెమ్మదిగా పూర్వ స్థితికి రావాలి. ఇదే విధంగా ఇప్పుడు ఎడమవైపు వంగి కుడిచేతిని పైకెత్తి సాధన చేయాలి. తొలిరోజే ఎక్కువ సమయం చేసేబదులు రోజూ సాధన చేస్తూ సమయాన్ని క్రమంగా పెంచుకొంటూ పోవాలి.

ప్రయోజనాలు

  • ఈ ఆసన సాధనతో పొత్తికడుపు దిగువన చేరిన కొవ్వు కరుగుతుంది.
  • నడుము, తొడ, పిక్కలు, భుజాల కండరాలు బలపడతాయి.
  • వెన్నుపూస కదలికలు సులభతరమవుతాయి.
  • చేతులు, కాళ్ళు, భుజాలకు చక్కని ఆకృతి వస్తుంది.
  • అంగం, యోని చుట్టూ ఉండే నాడులు ఉత్తేజితమవుతాయి. 

గమనిక: వెన్నుసంబంధిత సమస్యలున్న వారు నిపుణుల సలహా మేరకే దీన్ని సాధన చేయాలి.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE