బాల్యం గురించిన అలోచన వచ్చినప్పుడల్లా  సైకిల్ నేర్చుకున్నప్పటి రోజులు గుర్తుకు రాక మానవు. కాలంతో  బాటు మారని పిల్లల వ్యాపకాలలో సైకిల్ తొక్కటం ఒకటి. బోలెడంత ఆటవిడుపు తో బాటు  చక్కని ఆరోగ్యాన్ని అందించే ఏకైక  వాహనం. అన్ని తరగతుల వారు కొనగలిగిన వాహనమే గాక కాలుష్యపు సమస్యలూ ఉండవు. ఆరోగ్యం తో బాటు తగినంత ఫిట్నెస్ అందించే సైక్లింగ్  తాలూకు కొన్ని అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉపయోగాలు

  • కండరాల బలోపేతానికి సైక్లింగ్ ను మించిన వ్యాయామం మరొకటి లేదు. భుజాలు, గుండె కండరాలకు సైక్లింగ్ చేసే మేలు అంతాఇంతా కాదు.
  • తుంటి, మోకాళ్ళు, పిక్కల కదలికలను మెరుగు పరచటమే గాక వాటికి మేలైన ఆకారాన్నిచ్చే వ్యాయామమే సైక్లింగ్.
  • రన్నింగ్, జాగింగ్ కంటే సైక్లింగ్ సులభమైన వ్యాయామం. వారానికి కనీసం రెండు, మూడు గంటలపాటు సైకిల్ తొక్కితే  అవసరమైన కార్డియో వ్యాయాయం అందినట్లే.
  • స్టామినా పెంచుకోవాలనుకునే వారు, బరువు తగ్గించుకోవాలనుకునే వారు  రోజూ కాసేపు సైకిల్ తొక్కాలి. ఒక గంట పటు సైకిల్ తొక్కటం వల్ల సుమారు ౩౦౦ కేలరీలు ఖర్చవుతాయి. రోజూ అరగంట పాటు సైకిల్ తొక్కే వారు ఏడాదిలో 5 కేజీల బరువు తగ్గుతారు.
  • ఆయా అవయవాల మధ్య చక్కని సమన్వయానికి సైక్లింగ్ ఎంతో దోహద పడుతుంది.
  • సైక్లింగ్ ఏకాగ్రతను చేకూర్చటమే గాక నాడుల పని తీరును  మెరుగు పరుస్తుంది.
  • జీర్ణ, రక్త ప్రసరణ వ్యవస్థల మెరుగయిన పని తీరుకు, బీపీ, రక్తపోటు నివారణకు ఇది ఎంతగానూ ఉపయోగపడుతుంది.
  • రోజూ సాయంత్రం కాసేపు సైకిల్ తోక్కేవారిలో మానసికమైన సమస్యలూ రావు.



Recent Stories







bpositivetelugu

కంప్యూటర్‌ గేమ్స్‌ మితిమీరితే ఇబ్బందే

ఇప్పటి పిల్లలకు కంప్యూటర్‌ గేమ్స్ అంటే ప్రాణం. ఈ గేమ్స్ ప్రమాదాలకు తావులేని, చెప్పలేనంత వినోదం కలిగించే మాట నిజమే అయినా పిల్లలు ఎక్కువ సమయం

MORE
bpositivetelugu

మోక్షమాసం.. మార్గశిరం  

మన పంచాగం ప్రకారం మార్గశిరం.. తొమ్మిదవ నెల. విష్ణువుకు అత్యంత ప్రియమైన మాసమిది. మాసానాం మార్గ శీర్షోహం అని

MORE