పెద్దవయసు వారిలో కనిపించే సమస్యల్లో సయాటికా ఒకటి. సయాటికా బాధితుల్లో నడుము నుంచి పిక్క వరకు తీవ్రమైన నొప్పి ఉంటుంది . ఈ కారణంగా బాధితులు దేనిమీదా ఎక్కువసేపు దృష్టి సారించలేరు. అధికబరువు, మధుమేహం తదితర కారణాలు కూడా ఈ సమస్యకు దోహదపడతాయి. కేవలం మందులు వాడటం ద్వారా ఈ సమస్యను అదుపుచేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది. అయితే మందులకు తోడు రోజూ వ్యాఘ్రాసనం సాధన చేస్తే తక్కువ సమయంలోనే మంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాఘ్రం అంటే పెద్దపులి. ఈ ఆసన భంగిమలు పులి శరీర కదలిక మాదిరిగా ఉంటాయి గనుక దీనికి వ్యాఘ్రాసనం అని పేరు.

చేసే పద్దతి

సమతలంగా ఉన్న నేలమీద వజ్రాసనం( వెన్నుపూసను నిటారుగా పెట్టి మోకాళ్ళమీద కూర్చోవటం)లో కూర్చోవాలి. అనంతరం నెమ్మదిగా ముందుకు వంగి అరచేతులు, మోకాళ్ళ మీద నిలవాలి. ఈ భంగిమలో వెన్నుపూస భూమికి సమాంతరంగా ఉండాలి. ఇప్పుడు శ్వాస తీసుకొంటూ శరీర బరువును అర చేతులు, ఎడమ మోకాలి మీద ఉంచుతూ కుడి కాలును వీలున్న మేరకు చాచి పైకి లేపాలి. అరికాలు ఆకాశాన్ని చూసేలా పెట్టి, కాలి వేళ్ళు తల వెనుక భాగాన్ని చూసేలా పెట్టాలి. సుమారు 10 సెకన్లపాటు ఇదే స్థితిలో ఉండి గాలి వదులుతూ యథాస్థితికి రావాలి. ఇలా ఐదుసార్లు చేసాక ఈ సారి ఎడమకాలుతో ఇదే విధంగా సాధన చేయాలి.

ప్రయోజనాలు

  • వెన్నెపూస నరాలు,తుంటి కండరాలు ఉత్తేజితమై సయాటికా అదుపులోకి వస్తుంది.
  • ప్రసవం అయ్యాక ఈ ఆసనం వేస్తే శరీరం పూర్వాకృతిని సంతరించుకుంటుంది.
  • రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
  • జీర్ణశక్తి పెరుగుతుంది.
  • కటి, చేతులు, కాళ్ళ కండరాలు బలోపేతమవుతాయి.

 

గమనిక: మోకాలి నొప్పి, మెడనొప్పులున్న వారు ఈ ఆసనాన్ని సాధన చేయరాదు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE