శారీరక కదలికలు బాగున్నప్పుడే మనిషి రోజువారీ పనులు సక్రమంగా నిర్వర్తించగలడు. ముఖ్యంగా వయసు పైబడే కొద్దీ నడక, వంగిలేవటం వంటి పనులు కష్టతరమవుతాయి. అయితే ముందునుంచే రోజూ భద్రాసనం సాధన చేస్తే ఈ ఇబ్బందులు తొలగిపోయి శారీరక కదలికలు క్రమబద్ధమవుతాయి. 

సాధన పద్దతి

ముందుగా చదునైన చోట ప్రశాంతంగా కూర్చొని రెండు కాళ్ళు ముందుకు చాచాలి. ఇప్పుడు నెమ్మదిగా రెండు కాళ్ళను మడిచి అరకాళ్ళను కలిపి శరీరానికి వీలైనంత దగ్గరగా తీసుకురావాలి. తర్వాత అరచేతులను కలిపి, వేళ్ళను అల్లికగా పెట్టి చిత్రంలో చూపినట్టు పట్టుకోవాలి. వెన్ను నిటారుగా పెట్టి పక్షి రెక్కలు ఆడించినట్లు మోకాళ్ళను పైకి కిందికి ఆడించాలి. దీనివల్ల తుంటి, తొడ కండరాలు సడలి సులభంగా కదులుతాయి. ఇప్పుడు మోకాళ్ళను పూర్తిగా నేలపై ఆనించి వుంచాలి. ఇలా వీలైనంత సేపు వుండి యథాస్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. ఇలా మరో రెండుసార్లు చేయాలి. 

ఉపయోగాలు

మూత్రకోశ వ్యాధులు, రుతు సంబంధిత సమస్యలు నయమవుతాయి.

సుఖప్రసవానికి దోహదపడుతుంది.

 కిడ్ని, బ్లాడర్‌, జననేంద్రియాలు ఆరోగ్యంగా వుంటాయి.

హెర్నియా, సయాటికా, అజీర్తిని నివారిస్తుంది.

బిరుసెక్కిన తొడ కండరాలు, మోకాళ్లు, తుంటి కీళ్లు సడలుతాయి.

కటి, ఉదర భావాలకు రక్తప్రసరణ మెరుగవుతుంది. 

గమనిక: మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా వున్నవారు. దీనిని చేయొద్దు.Recent Storiesbpositivetelugu

యాప్ సాయంతో పరీక్షల్లో రాణింపు 

 ఫిబ్రవరి వచ్చేసింది. విద్యార్థులు  పరీక్షల కోసం రాత్రీ పగలూ చదువుకొనే సమయం. ఇన్నాళ్లుగా చదివిన  పాఠాలు, విషయాల్ని 

MORE
bpositivetelugu

మోక్షసిద్దినిచ్చే కర్ణాటక  సప్త క్షేత్రాలు

భక్తుని అంతిమ లక్ష్యం మోక్షమే. అంటే.. మరల మరల జన్మనెత్తవలసిన అవసరం లేకపోవటం. ఈ మోక్షసిద్దికి అయోధ్య, మథుర, 

MORE