మీరు రోజూ క్రమబద్ధమైన రీతిలో వ్యాయామం చేయాలనుకుంటే మంచి జిమ్ లో సభ్యత్వం తీసుకోవటం మంచిది. అయితే నగరాల్లో పుట్టగొడుగుల్లా వెలసిన వందలాది జిమ్ లలో మీరు కోరిన మార్పులను, ఫలితాలను అందించే మేలైన జిమ్ ఏదని తెలుసుకోవటం ఎలా? స్నేహితులు చెప్పారనో లేక బంధువులు మొహమాట పెట్టారనో ఏదో ఒక జిమ్ లో చేరితే వెచ్చించిన సమయం, డబ్బు నష్టపోవటంతో బాటు పలు అనారోగ్య సమస్యలు కూడా ఎదురుకావచ్చు. అందుకే కొత్తగా జిమ్ బాట పట్టా లనుకునేవారు ఈ దిగువ అంశాలపై  ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవి.. 

  • సభ్యత్వం తీసుకోదలచిన జిమ్‌లో తగినంత వెంటిలేషన్‌ ఉందా? జిమ్‌ నిర్వహణ ఎలావుంది? తగినంత విశాలంగా ఉందా? వంటి అంశాలను గమనించాలి.
  • జిమ్‌ లోపల ఉష్ణోగ్రత ఎలావుందీ? ఆహ్లాదంగా ఉందా? అని చూడాలి. వేడి నీళ్ల సౌకర్యం, టాయిలెట్ల శుభ్రత ను కూడా గమనించాలి.
  • వ్యాయామాలకు కావలసిన ఆధునిక పరికరాలు ఉన్నాయా? ఉన్నా మంచి కండిషన్‌లో ఉన్నాయా అని గమనించాలి. సాధారణంగా జిమ్‌లో కార్డియో ట్రైనింగ్‌ మెషీన్స్‌ 50 శాతం, వెయిట్‌ ట్రైనింగ్‌ మెషీన్స్‌ 30 శాతం, బార్‌ బెల్స్‌ అండ్‌ వెయిట్స్‌ 20 శాతం ఉండాలి. పది కార్డియో ట్రైనింగ్‌ మెషీన్లు ఉంటే కనీసం 4 ట్రెడ్‌మిల్స్‌, 2 ఇండోర్‌ బైసికిల్స్‌, 3 స్టెప్‌ మిషీన్లు, ఒక రోయింగ్‌ మెషీన్‌ తప్పనిసరిగా ఉండాలి. వెయిట్‌ ట్రెయినింగ్‌కొస్తే లెగ్‌ ప్రెస్‌, పెక్టోరల్‌ మజిల్‌ ప్రెస్‌, బ్యాక్‌ మజిల్‌ మెషీన్‌, షోల్డర్‌ ప్రెస్‌ వంటివి జిమ్‌లో తప్పనిసరిగా ఉండాలి.
  • మీ శరీర స్వభావం, ఆకారం, వృత్తి, అనారోగ్య సమస్యలు తదితర అంశాలను బట్టి మీకు అవసరమైన వ్యాయామాలను సూచించగల ఇన్‌స్ట్రక్టర్‌ ఉన్నారా? వారి అర్హతలు, అనుభవం వంటి వివరాలు అడిగి తెలుసుకోవాలి. ఇన్‌స్ట్రక్టర్‌ శిక్షణపరంగా ప్రొఫెషనలిజంతో వ్యవహరిస్తున్నారో లేదో గమనించాలి.
  • మీ వ్యాయామాన్ని బట్టి మీరు తీసుకోవాల్సిన ఆహారం గురించి సలహా ఇచ్చే పోషకాహార నిపుణులు, ఆరోగ్యపరమైన సలహాలిచ్చే వైద్యులు, ఉండేలా చూసుకుంటే మరీ మంచిది. అక్కడే లంగ్‌ కెపాసిటీ, ఎముకల ఎముకల బలం, శరీరంలో కొవ్వు శాతాన్ని నిర్ధారించే ఏర్పాటు ఉంటే మరీమంచిది.
  • వ్యాయామం తర్వాత ఈతకొట్టడం వల్ల శరీరానికి మంచి రిలాక్సేషన్‌ వస్తుంది. కఠినమైన వర్కవుట్లు చేసిన తర్వాత ఈత కొడితే శరీరం బాగా టోనప్‌ కూడా అవుతుంది. అందుకే స్విమ్మింగ్‌ పూల్‌ ఉంటే ఇంకా మంచిది.
  • వ్యాయామాన్ని బట్టి తీసుకోవాల్సిన మేలైన ఆహారాన్ని అందించే కెఫె కూడా మీ జిమ్ లో భాగంగా ఉంటే ఇంకా మంచిది.
  • పై అన్ని అంశాల విషయంలో మీరు ఒక స్పష్టతకు వచ్చాక వరుసగా 2 లేదా 3 రోజులు ఆ జిమ్ కు వెళ్లి అక్కడి వాతావరణం, శిక్షణ తీరుతెన్నులను పరిశీలించి, సంతృప్తి చెందితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సభ్యత్వం తీసుకోండి. ఆరోగ్యం మీద మీరు ఖర్చుపెట్టే ప్రతి రూపాయీ దీర్ఘకాలంలో మీకెంతో మేలు చేస్తుందని గుర్తించండి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE