జీర్ణసంబంధిత సమస్యలకు చెక్ పెట్టి మంచి జీర్ణశక్తిని అందించే ఆసనాల్లో పశ్చిమోత్తానాసనం ఒకటి.  పశ్చిమోత్తానాసనం ఎలా సాధన చేయాలి, దానివల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. 

సాధన 

 చదరంగా ఉన్నచోట కాళ్ళు ముందుకు చాచుకొని కూర్చోవాలి. అరచేతులను నేలకు ఆనిస్తూ వెన్నుపూస నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత   నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులను 90 డిగ్రీల కోణంలో నిట్టనిలువుగా లేపి, దీర్ఘ శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను వదులుతూ వెన్ను, మెడ వంచకుండా ముందుకు వంగి నుదిటిని మోకాళ్ళకు తాకిస్తూ చేతులతో కాలిబొటన వేళ్లను పట్టుకోవాలి. ఈ స్థితిలో మోకాళ్లు పైకి లేపకూడదు. ఈ భంగిమలో శ్వాస తీసుకుని వదులుతూ ఉండగలిగినంత సేపు ఉండి తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. ఇలా కనీసం 5 నుంచి 10సార్లు చేయాలి. తొలిసారి ఈ ఆసనం సాధన చేసేవారికి, పెద్ద పొట్ట ఉన్నవారికి  తల మోకాళ్ల మీదికి రాకపోవటం, ఆసనం మధ్యలో మోకాళ్ళు పైకిలేపటం వంటి ఇబ్బందులు ఎదురుకావడం సహజమే. అయితే సాధన చేసేకొద్దీ ఈ లోపాలను సవరించుకోవచ్చు.   

ఉపయోగాలు

  • పొత్తికడుపు కండరాల మీద ఒత్తిడి పెరిగి అక్కడ చేరిన అదనపు కొవ్వు కరుగుతుంది.
  • రక్తప్రసరణ మెరుగవటంతో బాటు రక్తశుద్ధి జరుగుతుంది.
  • జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
  • క్లోమగ్రంథి పనితీరు మేరుపడి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తై మధుమేహం అదుపులోకి వస్తుంది.
  • ఆకలి పెరుగుతుంది. మలబద్దకం బెడద ఉండదు.
  • గ్యాస్ట్రిక్ సమస్య, తలనొప్పి వంటి సమస్యలు వదిలిపోతాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE