వ్యాయామంతో శారీరక దృఢత్వం పెరిగేమాట నిజమే. అయితే.. చేసే వ్యాయామానికి, తీసుకొనే ఆహారానికీ పొంతన కుదిరితేనే ఇది సాధ్యమవుతుంది. ముఖ్యంగా కార్డియో, సర్క్యూట్‌ ట్రైనింగ్‌, స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ తరహా కసరత్తులు చేసేవారు తీసుకోవలసిన తగిన ఆహారం గురించి ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్న సలహాలేమిటో తెలుసుకుందాం. 

కార్డియో

గుండెకు బలాన్నిచ్చే వ్యాయామాలను కార్డియో వ్యాయామాలంటారు. రన్నింగ్‌, సైక్లింగ్‌, ఏరోబిక్స్‌ వంటివన్నీ కార్డియో కోవకే చెందుతాయి.

వీటిని సాధన చేసేవారు గంట ముందుగా కొవ్వు తక్కువగా, తగినన్ని కార్బొహైడ్రేట్స్‌ ఉండే ఆహారం తీసుకోవాలి. వీరు 1 అరటి పండు, గ్లాసు పాలు లేదా గుప్పెడు బాదం గింజలైనా తప్పక తీసుకోవాలి. వర్కవుట్‌ చేసిన తర్వాత అలసిన శరీరానికి పోషకాల మరింత ఎక్కువ అవసరం. అందుకే మాంసకృత్తులు, కార్బొహైడ్రేట్లు ఉన్న లో ఫ్యాట్‌ మిల్క్‌, కొబ్బరినీరు వంటివి తీసుకోవాలి. 

సర్క్యూట్‌ ట్రైనింగ్‌

పలు వ్యాయామాలను వెంటవెంటనే చేయటం ద్వారా ఎంచుకున్న కండరాల దృఢత్వాన్ని పెంచేలా చేసేదే సర్క్యూట్ ట్రైనింగ్. ఇందులో కూర్చొనిలేవటం, తాడాట, బస్కీలు తీయటం, తేలికపాటి డంబెల్స్ తో కసరత్తు.. ఇలా వారి వారి శారీరక అవసరాన్ని బట్టి ఒకదాని తర్వాత మరొకటి ఆపకుండా చేయాల్సి ఉంటుంది. దీనివాళ్ళ శరీరం బాగా అలసిపోతుంది గనుక ఈ వర్కవుట్‌కి ముందు ఎక్కువ కార్బొహైడ్రేట్స్‌, తక్కువ ప్రొటీన్లు ఉండే యాపిల్స్‌, అరటిపళ్లు వంటివి తీసుకోవచ్చు. వర్కవుట్‌కి గంటముందు గుప్పెడు డ్రై ఫ్రూట్‌ మిక్స్‌ తింటే తగినంత శక్తి చేకూరుతుంది. అలాగే.. వర్కవుట్‌ తర్వాత తక్కువ కొవ్వు ఉండే సలాడ్‌, స్మూదీ, ప్రొటీన్‌ షేక్‌ లేదా పండ్లు తినొచ్చు. 

స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌

కండరాల మధ్య సమన్వయాన్నిపెంచి, వాటి కదలికలను మెరుగుపరచి, అంతిమంగా బలోపేతం చేసేందుకు దోహదం చేసే వ్యాయామమే స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌. ఇందులో బరువులెత్తటం, బస్కీలు తీయటం వంటి అంశాలుంటాయి. ఈ వర్కవుట్‌కి గంట ముందు ప్రొటీన్‌, కార్బ్స్‌ ఉండే ఆహారం తీసుకోవాలి. దీనివల్ల అలసట తగ్గటమే గాక కండరాల మీద ఒత్తిడి తగ్గుతుంది. వర్కవుట్‌ తర్వాత ప్రొటీన్‌ షేక్‌ లేదా ఎనర్జీ బార్‌ తీసుకోవాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE