ఫిట్‌గా ఉండాలని కోరుకొని వారు ఉండరు. ముఖ్యంగా యువత ఫిట్‌నెస్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. నిజానికి చక్కని జీవనశైలి, రోజూ వ్యాయామం చేయటంతో బాటు మంచి ఆహారం తీసుకొనే ఏ వయసు వారైనా ఫిట్ గా ఉండటం సాధ్యమే. ఈ జాగ్రత్తలతో బాటు తరచూ ఫిట్‌నెస్‌ పరీక్షలు చేసి చూసుకోవటం వల్ల ఎవరెంత ఫిట్ గా ఉన్నారో తెలుసుకోవచ్చు. అవి.. 

  • ఆపకుండా 20 బస్కీలు తీసినా అలసట లేకపోతే ఫిట్ గా ఉన్నట్టే. అదే 5 బస్కీలు తీయగానే ఆయాసం వస్తే ఫిట్‌నెస్‌ లోపించినట్లే .
  • సుమారు 15 మెట్లు ఎక్కి దిగినా లేదా రెండు కిలోమీటర్ల మేర నడిచినా అలసట, ఆయాసం లేకపోతే మీరు ఫిట్‌గా ఉన్నట్టే.
  • సాధారణ వేగంతో 6 నిమిషాల్లో అరకిలోమీటర్‌ నడవగలిగితే మీ గుండె ఫిట్‌నెస్‌ పర్వాలేదు. అయితే ఆరు నిమిషాల్లో మీరు 200 మీటర్లు లేదా అంతకంటే తక్కువ నడిస్తే మాత్రం మీరు తప్పక గుండె ఫిట్‌నెస్‌ తక్కువగా ఉన్నట్టు భావించాలి.
  • సమతలంగా ఉన్న నేలపై వెల్లికలా పడుకొని కాళ్లను 90 డిగ్రీల మేరకు లేపగలిగితే మీ తొండ కండరాలు ఫిట్‌గా ఉన్నట్లే.
  • మీరు వజ్రాసనం వేసినప్పుడు మీ కాలి మడమలు పిరుదులను తాకితే నడుము, పిరుదుల కండరాలు ఫిట్ గా ఉన్నట్టే.
  • అర నిమిషం పటు శ్వాస తీసుకోకపోయినా ఎలాంటి అసౌకర్యం లేనివారి ఊపిరితిత్తులు మంచి కండీషన్‌లో ఉన్నట్టే.
  • నేల మీద అర మీటరు మేర గెంతగలిగితే కాలి కండరాలు ఫిట్ గా ఉన్నట్టే. పావు మీటరు ఎత్తున గెంతగలిగే వారి కాలికండరాల ఫిట్‌నెస్‌ పర్వాలేదు. 10 అంగుళాల ఎత్తు కూడా ఎగరలేని వారికి ఏమాత్రం ఫిట్‌నెస్‌ లేనట్టే.
  • ఫిట్‌నెస్‌ ఉన్న పురుషుల్లో కొవ్వు శాతం 18- 24 మధ్యలో ఉంటుంది. ఫిట్‌నెస్‌ ఉన్న మహిళల్లో 15- 18 శాతం ఉంటుంది. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE