సంస్కృతంలో కర్ణము అంటే చెవి. విల్లును ఎక్కుపెట్టినప్పుడు దాని నారిని(తాడును) చెవి వరకు లాగినట్లు ఈ ఆసన భంగిమ ఉంటుంది గనుక దీనికాపేరు వచ్చింది.

 సాధనా పద్దతి

  • ముందుగా సమతల ప్రదేశంలో రెండు కాళ్ళు ముందుకు చాపి విశ్రాంతిగా కూర్చోవాలి. ఈ స్థితిలో తల, వీపు నిటారుగా ఉంచాలి. ఇప్పుడు అరచేతులను తొడలమీద పెట్టి దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి.
  • తర్వాత నెమ్మదిగా శ్వాస వదులుతూ కొద్దిగా వంగి కుడిచేతి వేళ్ళతో కాలి బొటనవ్రేలిని పట్టుకొని, మోకాలు మడిచి నెమ్మదిగా కుడిచెవి వరకు తీసుకొనిరావాలి.
  • ఇదే సమయంలో ఎడమ చేతితో ఎడమ కాలి బొటన వేలిని గట్టిగా పట్టి ఉంచాలి. ఈ క్రమంలో ఎడమకాలును వంచకూడదు.
  • ఇదే భంగిమలో శ్వాసను పది సెకన్ల పాటు నిలిపి ఉంచి నెమ్మదిగా శ్వాస వదులుతూ కుడి కాలిని మెల్లగా క్రిందికి తీసుకు రావాలి.
  • ఇప్పుడు ఈసారి ఇదే విధంగా ఎడమ కాలిని చెవి వరకు తెచ్చి సాధన చేయాలి. 

ఉపయోగాలు

  • ఈ ఆసనాన్ని సాధన చేస్తే వృషణాల వాపు తగ్గుతుంది.
  • మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి బాధితులు ఈ ఆసనం సాధన చేస్తే తగ్గి పోతుంది
  • పిల్లలు, యువత ఆ ఆసనం సాధన చేస్తే గ్రహణ శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. 

గమనిక: కొత్తగా ఈ ఆసనం సాధన చేసేవారికి ఒక్కసారే ఈ ఆసనం పట్టుబడదు. అందుకే రోజూ సాధన చేయాలి. దీనికి కొంత సమయం పట్టినా ఓపికగా సాధన చేస్తే మెరుగైన ఫలితం ఉంటుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE