కూర్చోగల ఏ ప్రదేశంలోనైనా సులభంగా సాధన చేయదగిన ఆసనాల్లో గోముఖాసనం ఒకటి. చూసేందుకు ఆవు ముఖం భంగిమలో ఉండే ఆసనం గనుక దీన్ని గోముఖాసనం అంటారు. రోజూ ఈ ఆసనం సాధన చేస్తే కీళ్ళనొప్పుల నివారణ, నియంత్రణ పూర్తిగా సాధ్యమవుతాయి. 

సాధనా పద్దతి

 • ముందుగా కాళ్ళు సౌకర్యవంతంగా చాచి కూర్చోవాలి.
 • ఇప్పుడు నెమ్మదిగా ఎడమ కాలును చిత్రంలో మాదిరిగా మడిచి దానిపై కుడి కాలిని తీసుకురావాలి.
 • ఈ భంగిమలో అరికాళ్ళు వీలున్న మేరకు పైకి చూస్తూ ఉండాలి.
 • ఇప్పుడు కుడి చేతిని లేపి తలమీదుగా , ఎడమచేతిని వెనక్కితిప్పి కిందిగా వీపు మీదికి తెచ్చి చేతివేళ్ళతో బంధించాలి.
 • ఈ భంగిమలో తల ఎడమవైపు త్రిప్పుతూ శ్వాస తీసుకుని కుడివైపు తిరిగి శ్వాస వదలాలి.
 • తర్వాత కాళ్ళను మార్చి చేయాలి. ఇలా 4 లేక 5 సార్లు చేయాలి.

ప్రయోజనాలు

 • ఈ ఆసనం సాధన చేస్తే వెన్నుపూస, మెడ, భుజం నొప్పులు తగ్గుతాయి.
 • ఊపిరి తిత్తుల పనితీరును మెరుగుపరచి శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది.
 • ఉదరభాగపు కండరాలు బలోపేతమవుతాయి.
 • హెర్నియా బాధితులకు ఈ ఆసనం ఉపశమనాన్నిస్తుంది.
 • శరీరంలోని గ్రంథులు చురుగ్గా పనిచేసి ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తుంది.
 • మధుమేహం, అతిమూత్రం, ఇంద్రియ బలహీనత, రక్తపోటు వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. 

గమనిక: ప్రారంభంలో చేతులు అందకపోతే సాధ్యం కాకపోతే రుమాలును ఉపయోగించాలి. అయినా.. ఇబ్బందిగా ఉన్నవారు చేతులతో పాదాల బొటన వ్రేళ్ళను పట్టుకొని ముందుకు వంగి ఈ ఆసనాన్ని సాధన చేయవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE