ఈ ఆసనపు భంగిమ వంచిన విల్లు మాదిరిగా ఉంటుంది గనుక దీనికి ధనురాసనమనే పేరు వచ్చింది.

సాధన పద్దతి

 • ముందుగా బోర్లాపడుకుని రెండు కాళ్లూ దగ్గర పెట్టుకోవాలి.
 • ఇప్పుడు నెమ్మదిగా మోకాళ్లు వెనక్కి మడిచి చేతులతో చీలమండలాన్ని పట్టుకోవాలి. మొదటిసారిగా చేస్తున్నప్పుడు చీలమండలం పట్టుకోవడం కష్టమనిపిస్తే, పాదాల వేళ్ళను పట్టుకోవచ్చు.
 • నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ, తల.. భుజాలూ పైకి తీసుకురావాలి. ఈ దశలో మోచేతులు వంచకుండా నిటారుగా ఉంచాలి. సాధ్యమైనంత మేర తొడలు, మోకాళ్లనీ పైకి లేపాలి. ఈ స్థితిలో శరీరబరువును పొత్తికడుపు మీద నిలిపి శ్వాస తీసుకుని వదులుతూ అరనిమిషం పాటు అలాగే ఉండాలి.
 • చివరగా చేతులు, కాళ్లను వదిలి బోర్లాపడుకునే విశ్రాంతి స్థితిలోకి రావాలి.
 • ఒక నిమిషం విరామ ఇచ్చి మళ్ళీ ఇదేవిధంగా ఆసనాన్ని సాధన చేయాలి. ఇలా మూడు, నాలుగు సార్లు చేయాలి. 

ప్రయోజనాలు

 • ఛాతీ విశాలమవుతుంది. శ్వాస వాహికలు శుభ్రపడి కఫదోషాలు తొలగుతాయి.
 • థైరాయిడ్, వెన్నుపూస నొప్పి, తుంటి నొప్పి, సర్వైకల్ స్పాండిలైటిస్ తగ్గుతాయి.
 • గ్యాస్ట్రిక్, మలబద్ధకం, అజీర్తి వంటి ఉదర సంబంధ వ్యాధులు తొలగును.
 • గతి తప్పిన ఋతుక్రమం సాధారణ స్థితికి వస్తుంది. గర్భాశయ పనితీరు మెరుగుపడుతుంది.
 • మూత్రపిండాల సమస్యలు, మూత్ర సంబంధిత సమస్యలు తొలగును.
 • బొడ్డు చుట్టూ ఉండే నాడులు చైతన్యమవుతాయి. లైంగిక సామర్ధ్యము పెరుగుతుంది.
 • పొట్ట, పిరుదుల దగ్గర చేరిన కొవ్వు తగ్గుతుంది. 

గమనిక

 • గర్భిణులు, నెలసరి సమయంలో, ఈ ఆసనాన్ని సాధన చేయకూడదు.
 • హెర్నియా బాధితులు, మరీ బలహీనంగా ఉన్న వృద్ధులు, డిస్క్ సమస్య ఉన్నవాళ్లు చేయకూడదు.
 • తీవ్రస్థాయి స్పాండిలోసిస్, హైబీపీ ఉన్నవాళ్లు గురువు పర్యవేక్షణలో ఈ ఆసనాన్ని సాధన చేయాలి.Recent Storiesbpositivetelugu

యాప్ సాయంతో పరీక్షల్లో రాణింపు 

 ఫిబ్రవరి వచ్చేసింది. విద్యార్థులు  పరీక్షల కోసం రాత్రీ పగలూ చదువుకొనే సమయం. ఇన్నాళ్లుగా చదివిన  పాఠాలు, విషయాల్ని 

MORE
bpositivetelugu

మోక్షసిద్దినిచ్చే కర్ణాటక  సప్త క్షేత్రాలు

భక్తుని అంతిమ లక్ష్యం మోక్షమే. అంటే.. మరల మరల జన్మనెత్తవలసిన అవసరం లేకపోవటం. ఈ మోక్షసిద్దికి అయోధ్య, మథుర, 

MORE