సులభంగా చేసే వ్యాయామాల్లో స్కిప్పింగ్ ఒకటి. శరీరం మొత్తానికీ మేలు చేసే వ్యాయాయమిది. దీన్ని ఏ సమయములోనైనా, ఎక్కడైనా చేయవచ్చు.

ఇలా చేయాలి

ముందుగా మెత్తటి తివాచీ మీద లేదా పచ్చికలో నిలబడి శరీరాన్ని నిటారుగా, రిలాక్సింగ్‌ ఉంచి ఎదురుగా చూస్తూ నిలబడాలి. శరీర బరువునంతా మడమల గాక పాదాల ముందుభాగంలో నిలపాలి. స్కిప్పింగ్ చేసే వ్యక్తి ఎత్తుకు రెండింతల పొడవైన తాడును పాదాల కింద అదిమి పెట్టి రెండు అంచులను చేతులతో పట్టుకొని మీ ఎత్తుకు సమానంగా తిప్పుతూ గెంతాలి.

 ఉపయోగాలు

 • గుండెకు మంచి వ్యాయామం చేకూరుతుంది.
 • శరీరంలో వుండే అధిక కొవ్వును తొలగించుకోవచ్చు.
 • మనస్సు, శరీరం చురుకుదనాన్ని పొందుతాయి.
 • ఊబకాయం, అధిక బరువును తగ్గించుకోవచ్చు.
 • చర్మ సౌందర్యం పెరుగుతుంది.
 • ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
 • కాళ్ళు తొడల వద్దనున్న కండరాలు బలిష్టంగా తయారవుతాయి.
 • భుజాలు గుండ్రంగా, బలంగా తయారవుతాయి. చేతి మడమలు, వేళ్ళకు బలం చేకూరుతుంది.
 • రక్త సరఫరా మెరుగవుతుంది.
 • ఎముకలు బలపడతాయి. మధుమేహం అదుపులోకి వస్తుంది.
 • ఒక గంటసేపు స్కిప్పింగ్ చేస్తే 1000 క్యాలరీలు కరుగుతాయి.

గమనిక

 • అధిక రక్తపోటు వారు, సిజేరియన్‌ చేయించుకొని 3 నెలలు నిండనివారు, హెర్నియా రోగులు, గుండె జబ్బులున్నవారు స్కిప్పింగ్‌ చేయకూడదు. తొలిరోజే ఎక్కువ సమయం స్కిప్పింగ్ చేయకుండా రోజుకు కొంతసమయం పెంచుకొంటూపోవాలి. జనం చేసిన 2 గంటల లోపు స్కిప్పింగ్‌ చేయకూడదు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE