మన శరీరంలో అత్యంత ప్రధాన అవయవం వెన్నుపూస. వెన్ను బలంగా ఉంటేనే మనిషి కదలికలు బాగుంటాయి. ఇందుకు దోహదపడే ఆసనాల్లో వీరభద్రాసనం ముఖ్యమైనది. దీని సాధన పద్దతి , ఉపయోగాల గురించి తెలుసుకుందాం.   

సాధన

నిటారుగా నిలబడి రెండు అరచేతులు ఆకాశం వైపు చూపిస్తూ పైకి లేపి నమస్కార ముద్రలో తలమీద ఉంచాలి. ఇప్పుడు ఎడమకాలును కొంచెం వెనుకకు తీసుకొని శ్వాస వదులుతూ చేతులు రెండూ కలిపి నెమ్మదిగా ముందుకి వంచాలి. వెనుక కాలును వీలున్న మేరకు పైకి లేపేలా చూడాలి. చేతులు, వెనుక కాలు భూమికి సమాంతరంగా వచ్చిన తర్వాత 5 సార్లు శ్వాస తీసుకొని వదిలి తరువాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తిరిగి పూర్వస్థితికి రావాలి. ఇప్పుడు ఇదే విధంగా కుడికాలు లేపుతూ సాధన చేయాలి.

కాలు పైకి లేపలేనివారు ముందు వైపు కుర్చీ, డైనింగ్ టేబుల్‌గాని రెండడుగుల దూరంలో ఉంచి ముందుకు వంగి వాటిని పట్టుకొని వెనుక కాలును వీలైనంత పైకి నిటారుగా లేపవచ్చు.

 ఉపయోగాలు

  • వీపు పైభాగాలు, ఇతర కండరాలకు, కాలి కండరాలకు బలం చేకూరుతుంది.
  • ఈ ఆసనం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మానసికంగా కూడా బలంగా తయారవుతారు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE