మహాయోగి మత్స్యేంద్రనాధుని చేత రూపొందించబడిన ఆసనమిది. మహిళల్లో ప్రత్యుత్పత్తి అవయవాల పనితీరును మెరుగుపరచడం తో బాటు వెన్ను, తొడ భాగాలను బలపరచడం దీని ప్రత్యేకత.

సాధన పద్దతి

  • ముందుగా చదునైన చోట మెత్తని వస్త్రం పరచుకొని రెండుకాళ్ళు చాపి విశ్రాంతి స్థితిలో కూర్చోవాలి.
  • ఇప్పుడు ఎడమ కాలిని మడిచి కుడి కాలి కిందికి తేవాలి.
  • తర్వాత కుడి కాలిని ఎడమ కాలి మీదుగా తీసుకు వెళ్ళి చిత్రంలో చూపినట్లుగా ముందుకు చాపాలి. కుడికాలు మణికట్టు, పాదం ఎడమకాలి మోచిప్పను తాకేలా చూసుకోవాలి. అదేసమయంలో కుడి కాలి తొడ ఉదరానికి అనేలా ఉంచాలి.
  • ఇప్పుడు అదే భంగిమలో ఉంటూనే నడుము పైభాగాన్ని కుడివైపు తిప్పాలి. ఈ క్రమంలో కుడి చేతిని వీపు చుట్టుగా పోనిచ్చి ఎడమ కాలి మోకాలిని తాకే ప్రయత్నం చేయాలి. ఎడమ అరచేతిని ఎడమ పాదం పైన ఉంచాలి. (నడుముచుట్టూ చేతిని తిప్పలేనివారు అరచేతిని నేలకు ఆనించి వీలున్న మేరకు శరీరాన్ని తిప్పినా చాలు.)
  • 20 సెకన్ల పాటు ఇదే భంగిమలో ఉండి శ్వాస వదులుతూ నెమ్మదిగా పూర్వ స్థితికి రావాలి.
  • ఇదే విధంగా ఈ సారి కుడికాలు మడిచి చేయాలి.

ఉపయోగాలు

  • వెన్నుపూసకు తగినంత వ్యాయామం లభిస్తుంది.
  • కాలేయం, పిత్తాశయం, ప్రేగుల మీది ఒత్తిడి తగ్గి, వాటి పనితీరు మెరుగుపడుతుంది.
  • అధికబరువు, ఊబకాయం, మధుమేహం, అజీర్తి వంటి సమస్యలకు చికిత్సగా పని చేస్తుంది.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE