ఆరోగ్యం కోసం రోజూ వ్యాయామం చేయటం అవసరమే. అయితే ఉరుకులపరుగుల జీవితంలో రోజూ వ్యాయామం చేయటం కుదరకపోవచ్చు. ఇలాంటివారు ముద్రల సాయంతోనూ చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు. చేతి వేళ్లను ప్రత్యేకమైన భంగిమలలో పెట్టటాన్నే ముద్ర అంటారు. నిర్దిష్ట ముద్రలో ఉండి ధ్యానం చేయటం వలన సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. ఇలాంటి ముద్రల్లో అపానముద్ర ఒకటి. 

          ఆకాశానికి, భూమికి ప్రతీకలైన మధ్య, ఉంగరపు వేళ్ళ చివరలను అగ్నికి ప్రతీక అయిన బొటనవ్రేలి కొనతో తాకించి, మిగిలిన రెండు వ్రేళ్ళను నిటారుగా ఉంచితే దాన్ని  అపానముద్ర అంటారు. సుఖాసనంలోకానీ, వజ్రాసనంలోకానీ కూర్చుని రెండు మోకాళ్ల మీద రెండు చేతుల్ని పెట్టి శ్వాసమీద ధ్యాస ఉంచాలి. ఈ ముద్రలో 5 నుంచి 10 నిమిషాలు చేయాలి. 

ఉపయోగాలు

  • మలబద్ధకము, మొలల బాధితులు రోజూ ఈ అపానముద్రను 15 నుంచి 45 నిమిషాలు సాధన చేస్తే నెలరోజుల్లో మంచి ఉపశమనం లభిస్తుంది.
  • ఆహారం జీర్ణమై శరీరంలో మిగిలిన వ్యర్ధాలు శరీరం నుంచి బయటకు వెళ్లేలా దోహదం చేస్తుంది.
  • ఈ ముద్ర సాధన చేసేవారి మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది.
  • మూత్ర విసర్జన లోపాల బాధితులు రోజుకు 15 నుంచి 45 నిమిషాలు ఈ ముద్రలో ధ్యానం చేస్తే సమస్య దారికొస్తుంది.
  • ప్రోస్టేట్ సమస్య లేనివారు ఈ ముద్ర వేస్తే మూత్రనాళాల్లో చేరిన రాళ్ళు కరుగుతాయి.
  • రోజూ క్రమం తప్పక ఈ ముద్ర సాధన చేసేవారికి బాగా చెమట పట్టటం, గతంలో కంటే ఎక్కువగా మూత్ర విసర్జన జరుగుతుంది. దీని వల్ల శరీరంలోని వ్యర్ధాలు వదిలిపోవటమే గాక మనసులో మంచి భావాలు కలుగుతాయి.
  • ఈ ముద్ర సాధకుల్లో ఎప్పటికప్పుడు అపానవాయువు విడుదలై కడుపుబ్బరం వంటి సమస్యలు దరిజేరవు.
  • ఈ ముద్ర దంతాలను, చిగుళ్ళను బలోపేతం చేస్తుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE