వ్యాయామం చేయటం ఎంత ముఖ్యమో ఆ వ్యాయామాన్ని సరదాగా, ఉల్లాసంగా చేయటమూ అంతే ముఖ్యం . నవ్వుతూ, తుళ్ళుతూ వ్యాయామం చేసినప్పుడు త్వరగా అలసిపోవడం ఉండదు గనుక మరింత సమయం వ్యాయామం చేయొచ్చు . ఇలాంటి వ్యాయామాల్లో ‘హూలా హూప్‌’ ఒకటి. ఈ వ్యాయామం విదేశాల్లో మేలైన ఫిట్‌నెస్‌ ఎక్సర్‌సైజ్‌గా విశేష ఆదరణ పొందింది గానీ ఇటీవలి వరకు మనదేశంలో పిల్లల ఆటగానే పరిగణింపబడింది. అయితే ఇటీవలికాలంలో ఇక్కడా హూలా హూప్‌ సందడి మొదలయింది. 

హూలా హూప్‌ అంటే..

తేలికపాటి పెద్ద రింగును నడుముకు తగిలించుకుని శరీరాన్ని కదిలిస్తూ గుండ్రంగా తిప్పటమే హూలా హూప్‌. హూప్‌ నేల మీద పడిపోకుండా వీలున్నంత సమయం నడుముతో తిప్పుతూ ఉండాలి. ఇలా చేయటం వల్ల శరీరం మొత్తానికి వ్యాయామం దొరకటమే గాక ఏరోబిక్స్‌ చేసిన ఫలితం దక్కుతుంది. దీనికి డ్యాన్స్‌ తోడైతే మరింత ఉత్సాహంగా ఉంటుంది.

ప్రయోజనాలు

  • రోజూ కనీసం 20 నిమిషాలు హూలా హూపింగ్‌ చేస్తే గుండెకు తగిన వ్యాయామం లభిస్తుంది.
  • కాళ్ళు, పిక్కలు, పిరుదులు, నడుము కండరాలు బిగుతుగా, బలంగా తయారవుతాయి.
  • క్రమం తప్పక సాధన చేసేవారిలో రోజురోజుకూ శారీరక సామర్ధ్యం(ఫిట్‌నెస్‌) పెరుగుతుంది.
  • శరీరం అలసిపోయేలా చేసే ఈ వ్యాయామం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలై ఒత్తిడి తొలగి, ఉత్సాహం వస్తుంది.
  • వెన్నుపూస బలపడుతుంది.
  • రోజూ 20 నిమిషాల పాటు హూలా హూపింగ్‌ చేస్తే సుమారు 200 క్యాలరీలు ఖర్చవుతాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE