చలి కాలం రాగానే మన జీవనశైలి కూడా కొద్దిగా మారుతుంది. దీనికితోడు రవ్వంత బద్ధకమూ తోడవుతుంది. దీంతో క్రమం తప్పక వ్యాయామం చేసేవారు సైతం రోజులకొద్దీ డుమ్మా కొడుతుంటారు. ఇక.. ఈ రోజుల్లో జిమ్ లలో సైతం హాజరుశాతం బాగా తగ్గుతుంది . అయితే చలికాలంలో చేసే వ్యాయామం మరింత త్వరగా, మెరుగైన ఫలితాలను ఇస్తుందనే అవగాహన ఉన్నవారు మాత్రం చలికాలంలో ఒక్కరోజు కూడా వ్యాయామం చేయకుండా ఉండలేరు. శీతాకాలంలో ఇంట్లో చేసుకోదగిన కొన్ని రకాల ప్రత్యేక వర్కవుట్స్‌ గురించి తెలుసుకొని సాధన చేద్దాం. 

  • శీతాకాలంలో బరువులెత్తటం వంటి బలాన్నిచ్చే వ్యాయామాలు, ఈత వంటివాటి కంటే బ్రిస్క్‌ వాకింగ్, రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్ వంటి ఏ రోబిక్ వ్యాయామాలు మంచి ఫలితాన్నిస్తాయి.
  • బయట పొగ మంచు ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లోనే కార్పెట్ మీద సిటప్స్, పుషప్స్, స్క్వాట్స్, చైర్ డిప్స్ వంటివి సాధన చేయటం మేలు. డ్యాన్సింగ్, స్కిప్పింగ్, స్టెప్ అప్స్ వంటివీ చేయవచ్చు.
  • మిగిలిన కాలాల్లో కంటే చలికాలంలో ఏ వ్యాయామం చేసే ముందైనా వార్మప్ తప్పనిసరి. లేకపోతే గాయాల పాలయ్యే ప్రమాదం ఉంది. సాధారణ రోజుల్లో కన్నా శీతాకాలంలో రెట్టింపు సమయం వార్మప్‌ కోసం కేటాయించాలి.
  • శీతాకాలంలో ఆరుబయట వాకింగ్, జాగింగ్ చేసేవారు ఒంటికి ఊలు దుస్తులు, చేతులకు గ్లవ్స్, తలకు క్యాప్ ధరించాలి.
  • వ్యాయామం తర్వాత ఒక్కసారిగా ఊలు దుస్తులు తీసేయకుండా 10 నిమిషాలు ఆగి బయటి చలికి శరీరం ఎడ్జెస్ట్ అయిన తర్వాతే తీసేయాలి. లేకుంటే ఒళ్ళు ఒక్కసారిగా చల్లబడి బిగుసుకుపోయే ముప్పు ఉంది.
  • ఈ సీజన్‌లో సూర్యోదయం తరువాత నులివెచ్చని ఎండలో వ్యాయామం ఎక్సర్‌సైజ్‌లు చేస్తే మేలు.
  • వ్యాయామ సమయంలో ముక్కుతోనే శ్వాస తీసుకోవాలి. నోటితో తీసుకుంటే చలిగాలి తిన్నగా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాస సమస్యలు రావచ్చు.
  • చలికాలంలో వ్యాయామం చేయనిరోజు ఆఫీసులో లిఫ్ట్ కు బదులు మెట్లు వాడటం, మధ్యాహ్న భోజనం తర్వాత ఆరుబయట నడవటం, ఫోన్ మాట్లాడేటప్పుడు తిరుగుతూ మాట్లాడటంతో బాటు ఇంట్లోనూ క్లీనింగ్, గార్డెనింగ్ వంటివి చేస్తే వ్యాయామం చేసినట్లే.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE