వయసేదైనా సరే రోజూ కాసేపు ఏదైనా ఆట ఆడితే ఆరోగ్యంగా ఉండొచ్చని ఫిట్‌నెస్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఇష్టమైన ఆటను దినచర్యలో భాగంగా చేసుకొంటే శారీరకంగానే గాక మానసికంగానూ బలంగా ఉండొచ్చని చెబుతున్నారు. ఆటలతో వృత్తిగత సామర్ధ్యం మెరుగు పడటమే గాక గెలుపోటములను ఒకేలా స్వీకరించే సానుకూల దృక్పథం అలవడుతుందని వారు సూచిస్తున్నారు. మొదట్లో ఉదయాన్నే లేచి ఆట కోసం మైదానానికి వెళ్ళటం ఇబ్బందిగా అనిపించినా కొన్ని రోజుల్లోనే దానిపై ఆసక్తి పెరుగుతుంది గనుక జిమ్ మాదిరిగా డుమ్మాకొట్టే అవకాశమూ తక్కువేనని చెబుతున్నారు. ఒకే సమయంలో వాకింగ్, రన్నింగ్, స్ట్రెచ్చింగ్, వెయిట్‌ లిఫ్టింగ్‌... ఇలా భిన్నరకాల వ్యాయామ ప్రక్రియల ఫలితాలను అందించే క్రీడలను దినచర్యలో భాగం చేసుకోమని సూచిస్తున్నారు. 

ఆటల ఎంపిక ?

ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ కోసం ఆటలాడేవారు తమ ఎత్తు, బరువు, ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.అవసరాన్ని బట్టి వైద్యుల, వ్యాయామ శిక్షకుల సలహా తీసుకోవాలి. ఆట మరీ సున్నితమైనదిగా గాక అంతో ఇంతో శారీరక శ్రమ కల్గించేదై ఉండాలి. టెన్నిస్, బ్యాడ్మింటన్, క్రికెట్, స్కిప్పింగ్, సాకర్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, రగ్బీ, హ్యాండ్‌బాల్, జిమ్నాస్టిక్స్‌ వంటివేదైనా మంచి వ్యాయామం లభించినట్లే. 

ఆట సాధనకు ముందు?

  • దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు అటు ఆడే ముందు వైద్యులను, వ్యాయామ నిపుణులను సంప్రదించాలి.
  • ఆటకు ముందు కాసేపు తప్పనిసరిగా వార్మప్, కూల్‌డవున్‌ ప్రక్రియల్ని సాధన చేయాలి.
  • ఆటలో పడి టైమ్‌ని మర్చిపోవడం, సామర్థ్యానికి మించి ఆడటం మంచిదికాదు.
  • కొద్దిసేపు ఆడినా విశాలమైన ప్రదేశంలోనో, మైదానాలోనో ఆడితే మంచి ఫలితాలొస్తాయి.
  • ఆట సాధన చేసినంత కాలం శరీరంలో వచ్చే మార్పులను గమనించుకోవాలి. 

ఆటలు ..ప్రయోజనాలు

  • పెద్దగా శిక్షణ లేకుండానే ఆడగలిగే ఆట బ్యాడ్మింటన్‌. గంటసేపు బ్యాడ్మింటన్‌ ఆడితే దాదాపు 300 కేలరీలు కరిగిపోతాయి.
  • శరీరంలోని అన్ని భాగాలను కదిలించే ఆట బాస్కెట్‌ బాల్‌. కేవలం 20 నిమిషాల సెషన్‌లో 150- 250 కేలరీలు కరిగిపోతాయి.
  • అవకాశం, ఆసక్తి ఉంటే ఫుట్ బాల్ మేలైన వ్యాయామం. రన్నింగ్, వాకింగ్, ట్విస్టింగ్, కిక్కింగ్, డార్టింగ్‌ అన్నీ కలగలసిన ఆట ఇది. 45నిమిషాలు ఫుట్ బాల్ ఆడితే 450–550 కేలరీలు ఖర్చవుతాయి.
  • ఇలాంటిదే మరో ఆట రగ్బీ. ఇందులో రెజ్లింగ్, రన్నింగ్‌ కలగలసి ఉండే ఈ ఆట కండరాల సామర్ధ్యాన్ని పెంచుతుంది. 40 నిమిషాల సేపు ఆడితే 400–600ల కేలరీలు కరగాల్సిందే.
  • తక్కువ మందికి అందుబాటులో ఉండే ఆట...వాటర్‌ పోలో. ప్రతి 7 నిమిషాల సెషన్‌కు 60 నుంచి 80 దాకా కేలరీలు ఖర్చవుతాయి.



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE