ఆరోగ్యానికి మేలు చేసే వ్యాయామాలలో పరుగు ప్రధానమైనది. ఆని వయసుల వారికీ పనికొచ్చే నడకతో పోల్చినప్పుడు రన్నింగ్ కాస్త కష్టం. వయసు పైబడిన వారిని మినహాయిస్తే చిన్నారులు, యువత ఇష్టపడేది రన్నింగ్ నే.  శరీరంలోని కొవ్వు నిల్వలు కరిగించటం, శరీరానికి చక్కని ఆకృతిని ఇవ్వటం రన్నింగ్ ప్రత్యేకత. రన్నింగ్ వల్ల ముఖం కాంతి వంతంగా మారుతుంది. అయితే చాలా మంది రన్నింగ్ మొదలు పెట్టిన కొన్ని రోజులకే దానికి స్వస్తి చెబుతుంటారు. అందుకే రన్నింగ్ చేయాలనుకునేవారు ముందుగా ఒక చక్కని ప్రణాలికను సిద్దం చేసుకొని అమలులో పెడితే మరింత మెరుగైన ఫలితాలుంటాయి ..

మానసికంగా సిద్దమవటం

రన్నింగ్ అనేది అనుకున్నంత సులభమైన వ్యాయామం కాదు.  అదే సమయంలో ఎలాంటి ప్రణాళిక లేకుండా పరిగెత్తటం వలన శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మొదటగా రన్నింగ్ ప్రారంభించేటపుడు తొలుత చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని సాధన చేస్తూ క్రమంగా వాటిని పెంచుకుంటూ పోవాలి. రన్నింగ్ ఆరంభించిన వారం రోజుల వరకు ఎలాంటి ఫలితాలను ఆశించకూడదు.  సుదీర్ఘ ప్రయత్నం తరువాత మాత్రమే మంచి ఫలితాలను పొందుతారని గుర్తుంచుకోవాలి.

ఆహార  ప్రణాళిక

ఎక్కువ దూరం, సమయం రన్నింగ్ చేసే వారికి పోషకాలు అధికంగా అవసరం. మీరు ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరిస్తూ, బరువు తగ్గటానికి మంచి ఆరోగ్య ప్రణాలికలను అనుసరించటం చాలా మంచిది. ఆహారాన్ని తక్కువగా తీసుకుంటూ లేదా భోజనాలను తినకుండా పరిగెత్తటం వలన బరువు తగ్గటం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్, ఆరోగ్యవంతమైన కొవ్వు మరియు ప్రోటీన్'లు, ఎక్కువ ఫైబర్ మరియు ఇతర పోషకాలు ఉన్న పండ్లను, కూరగాయలను ఒక పట్టికగా రూపొందించుకొని వాటిని ఆహారంగా తీసుకోండి. మీరు పరిగెత్తటం మొదలు పెట్టిన తరువాత మంచి ఆహార ప్రణాలికను అనుసరించటం ఉత్తమం.

సవాలుగా తీసుకోండి

రోజు ఒకేలా పరిగెత్తటం కాకుండా కొత్త కొత్త పద్దతులను అనుసరించండి.  పరిగెత్తే సమయంలో ఎక్కువ వేగంగా మరియు ఎక్కువ దూరం పరిగెత్తండి.  మధ్య మధ్యలో విరామాలను తీసుకుంటూ తక్కువ దూరం పరిగెత్తండి. ఇలా తప్పని సరిగా మీ వ్యాయామంలో వైవిద్యాలను ప్రదర్శించటం చాలా మంచిది. తక్కువ సమయంలో ఎక్కువ దూరం, వేగంగా పరిగెత్తటం వలన శరీరంలో ఎక్కువ క్యాలోరీలు ఖర్చు చేయబడతాయి. అంతేకాకుండా, దీని వలన కండరాలలో బలం పెరగటమే కాకుండా, శరీర కణాలలో జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది. దీని వలన స్వయంచాలకంగా రోజులో శరీరంలోని అధిక క్యాలోరీలు ఖర్చు అవుతాయి.

ప్రణాళికలను అనుసరించండి

శిక్షణ సమయంలో ఒక ప్రణాళికను తయారు చేసుకొని, వాటిని అనుసరించటం వలన రోజూ ఏం చేయాలో, ఎలా చేయాలో ఒక ఆలోచన వస్తుంది. అవగాహన వస్తుంది . దీని వల్ల రన్నింగ్'లో కలిగే ప్రమాదాలను నివారించవచ్చు. 

పరిగెత్తే పద్దతి

ఎక్కువ దూరం పరిగెత్తెటపుడు, సరైన పద్దతిని పాటిస్తూ, దృష్టిని రన్నింగ్ పైన మాత్రమేకేంద్రీకరించాలి. సరైన పద్దతిలో పరిగెత్తెటపుడు ఎక్కువ శ్రమ అనిపించదు.  రన్నింగ్ చేసేటపుడు వేసే ప్రతి అడుగు నేలకి సమాంతరంగా వేస్తూ పరిగెత్తాలి. ఇలాంటి వాటిని అనుసరించటం వలన రన్నింగ్ ఉల్లాసంగా అనిపిస్తుంది. 

పైన తెలిపిన వాటిని అనుసరిస్తూ, శ్రావ్యమైన సంగీతాన్ని వినండి. వెంట కెమెరా కూడా తీసుకెళ్ల గలిగితే దారిలో కనిపించే ప్రకృతి అందాలను క్లిక్ అనిపించవచ్చు.  Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE