శ్రీరామ నవమి నాడు వడపప్పు, పానకం ప్రసాదంగా ఇవ్వటం తెలుగు వారి సంప్రదాయం. పేరుకు ప్రసాదమే అయినా బెల్లంతో చేసే పానకానికి చెప్పలేనన్ని ఆరోగ్యపరమైన విశేష గుణాలున్నాయి. వాటి వివరాలు, తయారీ విశేషాలు తెలుసుకోవటంతో బాటు నవమినాడు తప్పక పానకం రుచిని ఆస్వాదిద్దాం.
పానకం తయారీ
కావలసినవి: బెల్లం : 250 గ్రాములు, మిరియాలపొడి : 2 చెంచాలు, యాలకుల పొడి: 1 చెంచా, నీళ్ళు: 3 కప్పులు
తయారీ: గిన్నెలో నీళ్ళు పోసుకుని అందులో బెల్లం వేసి బాగా కలిపి తర్వాత యాలకు, మిరియాల పొడి వేసి కలిపితే పానకం తయారయినట్లే.