మండే ఎండల ధాటికి ఎన్ని నీళ్ళు తాగినా దప్పిక తీరటం లేదు. ఇక దాహం అయిన ప్రతిసారీ శీతల పానీయాలు తాగే అలవాటున్న వారి సంగతి ప్రత్యేకంగా  చెప్పాల్సిన పనేలేదు. అధిక మొత్తంలో చక్కెర ఉండే ఈ పానీయాల వల్ల  దప్పిక తీరకపోగా ఇంకా రెట్టింపు కావటం,  చెప్పలేనన్ని కేలరీలూ చేరే ముప్పు ఉంది.  ఒంటికి  చలువ చేసే హోం మేడ్  సమ్మర్ కూల్ డ్రింక్స్ తాగటం వల్ల  అటు దాహం తీరటంతో బాటు చక్కని ఆరోగ్యమూ చేకూరుతుంది. వాటి తయారీ వివరాలు తెలుసుకుందాం. 

పుచ్చ,నిమ్మరసం (నలుగురికి సరిపడా )

కావాల్సినవి

మూడు పెద్ద పుచ్చకాయ ముక్కలు, ఒక కప్పు చల్లని నీరు, రెండు చెంచాల నిమ్మరసం, చెంచా దాల్చిన చెక్క పొడి, చెంచా తేనె (కావాలనుకుంటే), 10 పుదీనా ఆకులు

తయారీ

ఒక గిన్నెలో పుచ్చకాయ ముక్కలు, పుదీనా ఆకులు కలిపి మిక్సీ పట్టి ఆ రసాన్ని ఒక మగ్గులోకి తీసుకోవాలి. దీనికి నిమ్మరసం, దాల్చిన చెక్క పొడి, చల్లని నీరు కలిపి బాగా గిలకొట్టి నేరుగా తాగేయవచ్చు. 

కీరదోస రసం

కావాల్సినవి: మూడు కీర దోసకాయలు, చెంచా పుదీనా తరుగు, కప్పు నీళ్ళు, రెండు పెద్ద నిమ్మకాయలు, చెంచా తేనె(ఇష్టాన్ని బట్టి), తగినంత  చక్కెర

తయారీ

ముందుగా నిమ్మకాయల పై చెక్కు ఒలిచి చక్రాలుగా కోసి దానికి చక్కెర కలిపి మందపాటి గరిటెతో బాగా మెదపాలి. ఆ మిశ్రమాన్ని వడపోసి రసం తీసుకోవాలి. ఒక మగ్గులోకి ఈ రసాన్ని తీసుకొని నిమ్మరసం పిండి పక్కన బెట్టుకోవాలి. ఇప్పు దు కీర దోసకాయల చెక్కు తీసి ముక్కలుగా కోసి, పుదీనా తరుగుకలిపి ముందు చేసిన రసంలో కలపాలి. దానికి సరిపడా నీళ్ళు, చక్కెర కలిపి నేరుగా తాగేయండి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE