ధూమపానం, వాతావరణ కాలుష్యం తదితర కారణాల వల్ల ఊపిరితిత్తులు నిరంతరం చెప్పలేనంత ఒత్తిడికి గురవుతాయి. ఈ పరిస్థితిని నివారించే జాగ్రత్తలను పాటించటంతో బాటు ఊపిరితిత్తులకు బలాన్నిచ్చే మేలైన పోషకాహారాన్ని తీసుకోగలిగితే లంగ్స్ ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. ఆ ఆహారపు వివరాలు తెలుసుకుందాం.

  • లంగ్స్ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు ప్రధానపాత్ర పోషిస్తాయి.అందుకే చియా( సబ్జా) విత్తనాలు, ట్యూనా చేప వంటివి తరచూ తీసుకోవాలి.
  • అల్లం, వెల్లుల్లి, మిరియాలు, పసుపు తదితరాల్లోని ఫైటో కెమికల్స్ ఊపిరితిత్తులను శుభ్ర పరచి శ్వాసను మెరుగుపరుస్తాయి. వాతావరణంలోని ప్రమాదకరమైన కణాలు లంగ్స్ మీద ప్రభావం చూపకుండా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
  • బెర్రీ, టమోటా, క్యాప్సికం, క్యారెట్, పుల్లని పండ్లు తీసుకుంటే తగినంత విటమిన్ సి, ఇ తో బాటు బీటా కెరోటిన్ లభించి ఊపిరితిత్తులకు తగు రక్షణ నిస్తాయి. గాలి సరఫరా చేసే వాయునాళాల పనితీరును ఇవి మెరుగుపరుస్తాయి.
  • క్యాబేజీ, కాలీ ఫ్లవర్, బ్రకోలిలో లభించే సల్ఫొరెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన వ్యర్ధాలను వదిలించి శుభ్రపరుస్తుంది.
  • పప్పుగింజలు, తృణ ధాన్యాలలోని మెగ్నీషియం లంగ్స్ పనితీరు మెరుగుపడేందుకు, ఆస్తమా వంటి వ్యాధుల నివారణకు దోహదపడుతుంది.
  • డీ కాఫినేటేడ్ పానీయాలతో పోల్చినప్పుడు టీ, కాఫీ తాగే వారిలో ఊపిరితిత్తుల పనితీరు బాగుంటుంది.
  • పాలు, గుడ్లు, జున్ను, మాంసం, గింజలు, చిక్కుళ్ళు రోజూ రెండు దఫాలుగా తీసుకునే వారిలో లంగ్స్ లోపలి సున్నితమైన కణజాలం మెరుగుపడుతుంది.

ఇతర జాగ్రత్తలు

  • గ్యాస్, తేపులు కలిగించే ఆహారం వల్ల శ్వాశ వ్యవస్థ కొంత ఒత్తిడికి లోనవుతుంది గనుక వాటికి దూరంగా ఉండాలి.
  • ఒకేసారి పొట్టనిండా ఆహారం తీసుకోకుండా నాలుగైదు దఫాలుగా తీసుకుంటే ఊపిరితిత్తుల మీద తక్కువ ఒత్తిడి పడుతుంది.
  • దాహం అయినప్పుడే మంచినీళ్ళు తాగే వారు రోజంతా అరగంటకు ఒకసారి ఎన్నోకొన్ని నీళ్ళు తాగుతూ ఉండాలి. భోజనం చేసేటప్పుడు అతిగా నీళ్ళు తాగకూడదు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE